తెలియకపోతే చెప్పొద్దు..

పిల్లల ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే, తెలుసుకొన్న తర్వాతే చెప్పాలంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని నమ్మకాలను అనుసరించాలంటూ పిల్లలను బలవంతం చేయకూడదు. వీలైతే వాటిలోని శాస్త్రీయతపై అవగాహన కలిగించాలి.

Published : 14 Nov 2022 00:18 IST

పిల్లల ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే, తెలుసుకొన్న తర్వాతే చెప్పాలంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని నమ్మకాలను అనుసరించాలంటూ పిల్లలను బలవంతం చేయకూడదు. వీలైతే వాటిలోని శాస్త్రీయతపై అవగాహన కలిగించాలి.

చిన్నారులకు కొత్తవిషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. తెల్ల కాగితంలాంటి వారి మనసులపై ఏది రాస్తే అదే శాశ్వతంగా నిలిచి పోతుంది. వారి సందేహాలకు తెలియదనడానికి మొహమాటపడి తోచింది చెప్పద్దు. పూర్తి సమాచారం తెలుసుకుని చెబుతానని చెప్పడంలో తప్పు కానీ చిన్నతనం కానీ లేవు. కానీ దాన్ని మరవకుండా తెలుసుకొని పిల్లలకు వివరిస్తే చాలు. వారి సందేహం తీరుతుంది. సరైన సమాధానం ఆ చిన్నారి మనసులో పదిలమవుతుంది.
అవమానించొద్దు.. ఏదైనా అడిగినప్పుడు ఇది కూడా తెలీదా అని చిన్నబుచ్చకూడదు. వెటకారం చేయొద్దు. అలా చేస్తే మరొకసారి ప్రశ్నించడానికి వెనుకడుగేస్తారు. తమకేదీ తెలియదనే ఆలోచన మొదలై, అది నూన్యతకు దారి తీస్తుంది. చిన్నారులతో సంభాషణ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి. వారిలో ఉత్సాహాన్ని నింపి ప్రతి విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచాలి. అందుకోసం.. మీరు ఎప్పటికప్పుడు కొత్త అంశాలు, వింతలు, విశేషాలు వంటివి చెబుతూ ఉండాలి. అప్పుడే... తల్లిదండ్రులు మాట్లాడే ప్రతి మాట గురించీ వారి చిట్టి మెదడు ఆలోచిస్తుంది.

ఊహాగానాలు.. ఏదైనా వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఫలానాది మంచి అలవాటు, ఇలాగే చేయాలి అంటూ మూఢ నమ్మకంలా చెప్పి అనుసరించాల్సిందే అని బలవంత పెట్టకూడదు. శాస్త్రీయత జోడించి అవగాహన కలిగించాలి. ప్రయోజనాలనూ వివరించాలి. పెద్ద వాళ్ళ ప్రవర్తనే పిల్లలను సరైన మార్గంలో నడిపిస్తుంది. మనం చెప్పిన దాంట్లో నిజం లేదని పిల్లలు తెలుసుకొంటే వేదనకు గురవుతారు. మరోసారి నిజం చెప్పినా నమ్మరు. మరెవరిపైనా నమ్మకం ఉంచరు. అందుకే నిజాల్ని మాత్రమే చెప్పడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్