వివాదం మంచిదే..

భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు రావడం మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడే ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థమవుతుందట.

Published : 20 Nov 2022 00:57 IST

భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు రావడం మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడే ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థమవుతుందట. వివాదం తర్వాత ఇద్దరూ తమ ఆలోచనలను పంచుకొనే విధానంలోనే అనుబంధం మరింత పెరిగే అవకాశం ఉందనీ చెబుతున్నారు.

దాంపత్యంలో అభిప్రాయభేదాలు వాటి ఫలితంగా చిన్న చిన్న వివాదాలు, సంఘర్షణలు వస్తూ పోతూ ఉంటాయి. తమదే సరి అని వాదించుకుంటారు. ఈ వాదనతో కొన్ని ఉపయోగాలూ ఉన్నాయి. ఒకరిగురించి మరొకరు బాగా తెలుసుకోవచ్చు. అవతలి వారి ఆలోచనావిధానాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే వాదన ఆరోగ్యకరంగానే సాగాలి తప్ప, నిందించుకోవడం, ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం చేయకూడదు. అవతలివారి మనసులో ఏముందో వారి వాదన ద్వారా తెలుసుకోవాలంటే పూర్తిగా వినాలి. అప్పుడే వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు. అలాకాక వారి మాటలకు కోపాన్ని ప్రదర్శిస్తే వాదన పెరుగుతుంది తప్ప, తగ్గదు. ఒకరు గట్టిగా వాదిస్తున్నప్పుడు, మరొకరు నిశ్శబ్దంగా ఉండగలగాలి. అప్పుడే ఆ గొడవ త్వరగా చల్లారిపోతుంది. ఆ తర్వాత అవతలివారికి అవగాహన కలిగించగలిగితే చాలు. అక్కడితో ఆ విషయానికి తెరపడుతుంది.
వాదన తర్వాత..  వర్షం కురిసి వెలిసినట్లు వాదన ముగిసిన తర్వాత ఇరువురి మధ్య వాతావరణం స్తబ్ధుగా అనిపిస్తుంది. ఆ వాతావరణాన్ని మాటలతో మార్చుకొని తిరిగి ఉల్లాసం నిండేలా చేసుకోవాలి. ఎలాగంటే.. అవతలి వారికి మీ మనసులోని భావాలను వివరించాలి. ‘నువ్వలా మాట్లాడుతుంటే ఎక్కడ దూరమవుతావో అని భయపడ్డా. నా వల్ల పొరపాటు జరిగితే చెప్పు.. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తా. అలాగే నీ గురించి మరోసారి ప్రశాంతంగా ఆలోచించు.. నీకే తెలుస్తుంది’ అంటూ అనునయించాలి. వాదన ముగిశాకా కూడా ఎదుటి వారిని మాటలతో బాధ పెట్టకూడదు. అలా చేస్తే గొడవ మళ్లీ మొదలవుతుంది. అలా కాకుండా ప్రశాంతంగా ఇరువురూ కూర్చొని మాట్లాడుకుంటే చాలు. అభిప్రాయభేదం ఎందుకొచ్చిందో చర్చించుకోవాలి. ఇరువురూ ఎదుటివారి అభిప్రాయానికి విలువనివ్వాలని నిర్ణయించుకుంటే చాలు. మరోసారి అటువంటి సందర్భాలు రావు. వచ్చినా వాదనలు తగ్గుతాయి. కొన్నిసార్లు అవతలి వారు మొండి వాదన వీడకుండా ఉంటే మాత్రం చర్చ అక్కడితో ఆపేయాలి. మీది తప్పు ఉందని అనిపిస్తే క్షమించమని అడిగితే చాలు. అవతలి వారికి మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. మెల్లగా అంతా సర్దుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్