పిల్లలు పేచీ పెట్టేస్తున్నారా...

పిల్లలతో అన్నమే కాదు అల్పాహారాలు తినిపించడమూ కష్టమే కదూ! మనం కూడా దోశలు, గారెల్లాంటివి చేయాలంటే పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం లాంటి ప్రహసనం ఉంటుంది కనుక చపాతీ వైపు మొగ్గు చూపుతాం.

Published : 02 Dec 2022 00:37 IST

పిల్లలతో అన్నమే కాదు అల్పాహారాలు తినిపించడమూ కష్టమే కదూ! మనం కూడా దోశలు, గారెల్లాంటివి చేయాలంటే పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం లాంటి ప్రహసనం ఉంటుంది కనుక చపాతీ వైపు మొగ్గు చూపుతాం. కానీ తరచుగా చపాతీలే అంటే.. మన చిచ్చర పిడుగులు బుద్ధిగా తింటారేంటి?! వద్దంటే వద్దంటూ ముఖం తిప్పేసుకుంటారు. కానీ ఆ గడుగ్గాయలతో చపాతీలు తినిపించే ఐడియా ఒకటుందండోయ్‌! పెద్దగా కష్టపడకుండానే వాటికి వేరే వేరే రుచులు తెప్పించేసి పిల్లలు ఇష్టంగా తినేలా చేయొచ్చు. ఎలాగంటారా.. చదివేయండి...

* తాలీపీఠ్‌ మామూలుగా గోధుమ పిండితో చపాతీ చేస్తాం. దాంతోబాటు బియ్యప్పిండి, జొన్నపిండి, చిలగడదుంప పొడి, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర తరుగు కలిపి చేస్తే అదే తాలీపీఠ్‌. ఈ చపాతీలను పిల్లలు ఇంకా కావాలని అడగకపోతే చూడండి.

* బీట్‌రూట్‌ చపాతీ గోధుమపిండిలో బీట్‌రూట్‌ తరుగు, అల్లం పచ్చిమిర్చి ముద్ద కలిపి చేసే చపాతీలు ఎర్రెర్రగా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, ప్రత్యేక రుచితో పిల్లలకు తెగ నచ్చుతాయి.

* పాలక్‌ చపాతీ గోధుమ పిండిలో పాలకూర పేస్టు, అల్లం ముద్ద కలిపి చేసే చపాతీలు లేతాకుపచ్చ రంగుతో పసందుగా కనిపించడమే కాదు వాటికి అదుర్స్‌ అనిపించే రుచి వస్తుంది.

* పరోటా ఉడికించిన బంగాళాదుంప, ఉల్లి, మిర్చి ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి కలిపిన మిశ్రమాన్ని కలిపి చేసే పరోటా చపాతీ రుచి కంటే అమోఘంగా ఉండి ఆహా అనిపిస్తుంది.

* స్వీట్‌ చపాతీ తీపి ఇష్టపడే చిన్నారులకి గోధుమపిండిలో పాలు, పంచదార, ఇలాచీపొడి, కాస్తంత వెన్న లేదా నెయ్యి కలిపి చేసే స్వీట్‌ చపాతీ పెట్టి చూడండి. వహ్వా అనేస్తారు.

* ఎన్నెన్ని రుచులో! అంతే కాదండోయ్‌.. చపాతీ పిండిలో పన్నీర్‌, చీజ్‌, క్యాలీఫ్లవర్‌, బ్రకోలి, క్యాబేజ్‌.. ఇలా ఒక్కోసారి ఒక్కో రకం కలిపి చపాతీలు చేసుకోవచ్చు. దేనికదే భిన్న రుచితో ఉంటుంది కనుక ‘ఎప్పుడూ చపాతీనేనా?’ అంటూ మారాం చేయరు. చకచకా తినేసి మా మంచి అమ్మ అని మెచ్చుకుంటూ ముద్దులు కూడా కురిపిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్