భారం కాకూడదు... బాధ్యతగా ఉండండి

ఆలుమగలిద్దరూ పనిచేస్తే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, పనుల ఒత్తిడి ఇద్దరి మధ్య అలకల్ని, అపార్థాల్ని పెంచుతాయి. అలాగని ఒకరి తప్పొప్పుల్ని మరొకరు ఎంచుకుంటుంటే... గొడవలు పెరిగిపోతాయి. ఒకరికొకరు భారం అవుతారు.

Updated : 08 Dec 2022 05:03 IST

ఆలుమగలిద్దరూ పనిచేస్తే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, పనుల ఒత్తిడి ఇద్దరి మధ్య అలకల్ని, అపార్థాల్ని పెంచుతాయి. అలాగని ఒకరి తప్పొప్పుల్ని మరొకరు ఎంచుకుంటుంటే... గొడవలు పెరిగిపోతాయి. ఒకరికొకరు భారం అవుతారు. మరి అలాకాకూడదంటే...

భార్యాభర్తల బంధంలో ప్రేమాభిమానాలు చూపించుకోవడం ఎంత ముఖ్యమో... ఎవరి బాధ్యతల్ని వారు అర్థం చేసుకోవడమూ అంతే అవసరం. బాధ్యత అంటే బరువులెత్తేస్తున్నట్లు ఫీలైపోకండి. కుటుంబంలో మీ పాత్ర ఏంటి? మీరు చేయాల్సిన పనులు ఏంటి? వాటిని ఎంత వరకూ నెరవేరుస్తున్నారు. ఎక్కడ విఫలమవుతున్నారు గమనించుకోండి. ఎందుకంటే...  ఇంటి అవసరాలను, కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకోగలిగితేనే అపార్థాలు తొలగి అనుబంధం పదిలమవుతుంది.

* పని ఒత్తిడి మీ జీవన శైలిలో భాగం అయ్యి ఉండొచ్చు. అలాగని దీర్ఘకాలం ఆ ప్రభావం ఉంటే... దాంపత్యంలో కలతలు ఖాయం. ఆలుమగల మధ్య అభద్రత మొదలైతే... ఇది సంసార జీవితాన్ని నిరాసక్తంగా మార్చేయొచ్చు. అందుకే... ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మీరు చేయాల్సిన పనులు నిర్వర్తించడంలో అలక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా మీ భాగస్వామికీ, పిల్లలకీ సమయం కేటాయించే విషయంలో, వారి అవసరాలను తెలుసుకునేటప్పుడూ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యుల సాయమూ తీసుకోండి. వారితో మాట్లాడి పని విభజన చేసుకోండి. మీ ఇబ్బందులని వారితోనూ చర్చించండి. అప్పుడు వారూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

* ఇంటిపనైనా, ఉద్యోగమైనా ఎవరి స్థాయికి వారికి అవి ముఖ్యం అన్నది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి. మీరే హోదాలో ఉన్నా... మీ భాగస్వామి ఉద్యోగాన్ని, వారి సంపాదననూ తక్కువ చేయొద్దు. వీలైతే మరో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించండి. మీలానే వారికీ ఒత్తిళ్లు ఉంటాయని గ్రహించండి. అప్పుడే ఎదుటివారి బాధలు అర్థమవుతాయి. మీ అనుబంధం ఆనందంగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్