చదవడంలో చేయూత..

రజని కొడుకును చదవమని చెప్పినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. బలవంతంగా చదివించినా పరీక్ష రాయడానికి ఆసక్తి చూపించడు.

Published : 12 Dec 2022 00:01 IST

రజని కొడుకును చదవమని చెప్పినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. బలవంతంగా చదివించినా పరీక్ష రాయడానికి ఆసక్తి చూపించడు. అన్ని విషయాల్లోనూ ఉత్సాహంగా ఉండే పిల్లలు చదువు దగ్గరకొచ్చే సరికి మొరాయించడానికి కారణాలనేకం అంటున్నారు నిపుణులు. వాటిని గుర్తించి సరిచేయాలని సూచిస్తున్నారు.

రోజూ ఫలానా సమయానికి పుస్తకాలు తీసి చదవాలనే ఆంక్షలు కొంతమంది పిల్లలకు నచ్చవు. వారికిష్టమైన సమయంలోనే చదవడానికి ఆసక్తి చూపిస్తారు. అదేంటో గుర్తించాలి. అలాగే నాకు ఇష్టమైన చోట కూర్చుని చదువుతా అంటే ఆమోదించాలి. నాలుగైదు రోజులు వాళ్లను పరిశీలిస్తే వారెంచుకున్న సమయంలో ఎలా చదువుతున్నారో తెలుస్తుంది. అనుకున్నట్లుగానే హోంవర్క్‌ పూర్తి చేస్తున్నట్లు గమనిస్తే దాన్నే కొనసాగించడం మంచిది. కొందరు పిల్లలు ఉదయం కాకుండా సాయంత్రం ఆడుకున్న తర్వాత పుస్తకాల ముందుకు రావడానికి ఇష్టపడతారు. ముందు చదువు, ఆ తర్వాతే ఆట అంటే వారికి ఏకాగ్రత ఉండదు. వారి మూడ్‌ బట్టి కొంత స్వేచ్ఛనిస్తూ మరొకవైపు చదువును అశ్రద్ధ చేయకుండా చూడగలగాలి.

ఏ రోజుది ఆరోజే.. పాఠాలు పూర్తిచేయడంలో ఏ రోజుది ఆరోజే అన్న ప్రణాళికను పిల్లలకు అలవాటు చేయాలి. సమయాన్ని వారిష్టానికి వదిలినా.. హోంవర్క్‌, చదవాల్సిన పాఠ్యాంశాలను పూర్తిచేయడానికి మాత్రం వాయిదా పద్ధతి కుదరదని నిక్కచ్చిగా చెప్పాలి. ఎప్పటి పాఠం అప్పుడు చదివితే ఒత్తిడి ఉండదని చెప్పాలి. పరీక్షలకు రివిజన్‌ చేసుకొంటే చాలు, సులభంగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చనేది నేర్పించాలి.

సాయం.. చదువు విషయంలో వారికేదైనా చేయూత అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది పిల్లలకు అర్థమైతే చాలు. ఉదయం నిద్ర లేపడం నుంచి ఏ రోజు ఏ సబ్జెక్టు చదవాలనుకుంటున్నారో అడిగి ఆ ప్రణాళికను వారి గదిలో గోడపై స్టిక్‌ చేయడం వరకు అన్నింట్లో సాయంగా ఉంటే చాలు. ఇంట్లో అమ్మానాన్న చదవమన్నప్పుడల్లా వారి కోసమే చదువుతున్నామనే ఆలోచన రాకూడదు. తమ భవిష్యత్తు కోసం అమ్మానాన్నలు తమకు చదవడంలో చేయూతనిస్తున్నారనే ఆలోచన, అవగాహన పిల్లల్లో తెప్పించగలిగితే చాలు. తల్లిదండ్రుల కోసం కాకుండా చదువు అనేది తమ బాధ్యత అనేది పిల్లలకు తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్