ఒకే మాటగా నడవాలి...

సంసారం సంతోషంగా సాగిపోవాలంటే... ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకుంటూ, బాధ్యతల్ని పంచుకుంటూ అడుగులేయాలి. అలాగని పూర్తిగా అన్ని విషయాలకూ భాగస్వామిపై ఆధారపడటం తప్పంటారు నిపుణులు.

Updated : 25 Dec 2022 04:47 IST

సంసారం సంతోషంగా సాగిపోవాలంటే... ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకుంటూ, బాధ్యతల్ని పంచుకుంటూ అడుగులేయాలి. అలాగని పూర్తిగా అన్ని విషయాలకూ భాగస్వామిపై ఆధారపడటం తప్పంటారు నిపుణులు.

* పెళ్లయ్యేవరకూ... తమ ఇష్టాలకూ, ఆస్తకులకూ అత్యంత ప్రాధాన్యం ఇచ్చినవారు కూడా... తరువాత ఆసక్తి చూపించరు. నచ్చిన అంశాలను కూడా పక్కన పడేస్తారు. తాము చేయాల్సిన చిన్న చిన్న పనులకు కూడా ఎదుటివారి అనుమతి తీసుకోవడం,  ప్రతి ఆలోచనకూ భాగస్వామి అభిప్రాయాన్ని అడగడం వంటివన్నీ మొదట్లో సంతోషాన్నిస్తాయి. అయితే క్రమంగా మీపై మీకు ఆసక్తిని తగ్గిస్తాయి. నిజానికి ఇద్దరి మధ్యా ఏ అరమరికలు లేకుండా ఉండటం మంచి విషయమే కానీ... ఇది క్రమంగా ఎదుటి వారిపైనా ఒత్తిడిని కలగజేస్తుంది.

* ఒకే మాటగా... కుటుంబం అన్నాక బోలెడు వ్యవహారాలు ఉంటాయి. ఇంటి అవసరాలూ, పిల్లల పెంపకం వంటివి ఏవైనా సరే... అన్నింటికీ ఎదుటివారు చెప్పినదానికి తలూపేయొద్దు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ తగ్గాల్సి వచ్చినా బెట్టు చేయొద్దు. ఎందుకంటే... మన మాటే నెగ్గించుకోవాలన్న పంతంతో కాకుండా... ఇంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒకే నిర్ణయం తీసుకోగలిగితే మీ అనుబంధం ఆనందంగా సాగిపోతుంది.

మనసు తెలుసుకొని... దంపతులిద్దరూ ఎదుటివారి మనసును తెలుసుకొని నడవాలి. అలాగని తమకంటూ ఉండే స్పేస్‌ను వదిలేయకూడదు. ఇద్దరూ కలిసి ఉన్న సమయాన్ని సంతోషంగా గడపడానికి ప్రాముఖ్యతనివ్వాలి. వ్యక్తిగత అభిరుచులకూ, ఇతరత్రా విషయాలకు సమయం కేటాయించడానికి తమ బాధ్యతల్నీ విస్మరించకూడదు. ప్రణాళికతో సమన్వయం చేసుకోగలిగితే చాలు ఒత్తిడి, ఆందోళనలకు చోటుండదు. ఎదుటివారు తమని నిర్లక్ష్యం చేస్తున్నారనే భయం, తామేదో కోల్పోయామన్న అభద్రత ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్