మొండి పిల్లలు మారాం చేస్తున్నారా?

మూడు నాలుగేళ్లు వచ్చేవరకూ పిల్లలు చేసే పనులన్నీ ముద్దుగానే అనిపిస్తాయి. ఆ తరువాత కూడా అలానే గారాబం చేస్తుంటే పేచీలు పెరిగిపోతుంటాయి. అడిగిందల్లా సాధించుకోవాలనే మొండితనం మితిమీరిపోతుంది.

Published : 25 Dec 2022 00:34 IST

మూడు నాలుగేళ్లు వచ్చేవరకూ పిల్లలు చేసే పనులన్నీ ముద్దుగానే అనిపిస్తాయి. ఆ తరువాత కూడా అలానే గారాబం చేస్తుంటే పేచీలు పెరిగిపోతుంటాయి. అడిగిందల్లా సాధించుకోవాలనే మొండితనం మితిమీరిపోతుంది. మరేం చేయాలంటే...

* పిల్లలకు కాస్త ఊహతెలిసే సమయంలో ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది. అన్నీ తెలుసు కోవాలనీ, సొంతం చేసుకోవాలనీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అందులోని అవసరాన్ని గుర్తించండి. జ్ఞానాన్ని పెంపొందించే విషయాలూ, వస్తువులైతే స్థోమతకు తగ్గట్లు కొనివ్వండి. లేదంటే నో చెప్పడానికి వెనుకాడొద్దు.  ఎందుకంటే...ఇదే వారిని జాగ్రత్తగా మలుచుకోవాల్సిన సమయం మరి.

* కొందరు తాము అడిగింది సాధించుకునే వరకూ మొండిగా ప్రవర్తిస్తుంటారు. అలగడం, ఏడవడం, అన్నం తినక పోవడం చేస్తుంటారు. ఇలాంటప్పుడు భయపడి తెచ్చి ఇచ్చేయొద్దు. పట్టూ విడుపులు అర్థమయ్యేలా తెలియజేయాల్సిన సందర్భం ఇది. అందుకే వారు అడిగినదానికి ప్రత్యామ్నాయంగా మూడు ఆప్షన్స్‌ ఇవ్వండి. వాటిని ఎంచుకోమని చెప్పండి. కాదంటే... ఎలా నష్టపోతారో వివరంగా చెబితే సరి. మొండి పట్టుదల సడలుతుంది.

* పెద్దలుగా వారి మంచి చెడులు మీకు తెలియొచ్చు అంతమాత్రాన వారి ఇష్టాయిష్టాలు తెలుసు కోకుండా మీ అభిప్రాయాల్ని రుద్దాలని ప్రయత్నించొద్దు. ఒక్కోసారి తన మాటకే విలువిస్తూ ఆ విషయాన్నీ వారికి అర్థమయ్యేలా చెప్పండి అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే, తన స్నేహితుల తల్లిదండ్రులతో పోల్చుకుని బాధ పడటం, మిమ్మల్ని లెక్క చేయకుండా మొండిగా వ్యవహరించడం వంటివి చేసే ప్రమాదం ఉంది.

* ఎదిగే పిల్లలకు తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. అలా చెయ్‌.. ఇలా చెయ్‌ అర్డర్లు వేస్తుంటారు. మీ పాప ఆడుకుంటున్న బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయను కోండి. ‘అవన్నీ సర్దిపెట్టు..!’ అని గదిమితే వారికది కష్టంగా అనిపించవచ్చు. బొమ్మలు ఇవ్వాలన్నా, ఇతరత్రా వస్తువులు తీయాలన్నా... ముందే వాటిని తీసిన చోటే సర్దిపెడతాను అంటేనే ఇస్తా అని చెప్పండి. సరే అని... ఆ పని చేయకపోతే మరోసారి ఇవ్వొద్దు. అప్పుడు మాట తప్పడం ఎంత తప్పో, మొండిగా ఉంటే ఎంత నష్టమో వారికి అర్థమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్