మీ ఇష్టాన్ని చెబితేనే...

పెళ్లయిన కొత్తల్లో ఎంతో హాయిగా గడిచిపోతుంది జీవితం. ఏళ్లు గడిచే కొద్దీ ఇద్దరూ కలిసే బతుకుతున్నా...జీవితం నిస్సారంగా సాగిపోతుంది.

Updated : 26 Dec 2022 06:35 IST

పెళ్లయిన కొత్తల్లో ఎంతో హాయిగా గడిచిపోతుంది జీవితం. ఏళ్లు గడిచే కొద్దీ ఇద్దరూ కలిసే బతుకుతున్నా...జీవితం నిస్సారంగా సాగిపోతుంది. దానికి కారణం మనం కోరుకున్నంత ప్రేమ అందడం లేదనో, ఏకాంతం దొరకడం లేదనో అసంతృప్తికి చోటివ్వడమే. ఇలాంటి పరిస్థితి అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. దీన్ని ఎలా అధిగమించాలంటే...

* దూరం పెరగనివ్వొద్దు... ఎంతగా ప్రేమించేవాళ్లైనా... మన మనసులో ఉన్నవన్నీ తెలుసుకుంటారనీ, మన ఆలోచనలన్నీ, భావాల్నీ ఇట్టే చదివేస్తారనీ అనుకోవద్దు. భాగస్వామిపై ప్రేమను ఏదో రూపంలో బయటపెట్టాల్సిందే. ఒకవేళ మీరు అవతలివారి నుంచి ఏదైనా కోరుకుంటుంటే...దాన్నీ స్పష్టంగా చెప్పగలిగినప్పుడే ఇద్దరి మధ్యా కోపతాపాలకు తావు ఉండదు. 

* బాధ్యతల్ని పంచండి...  ఇతరుల సమస్యల్ని అర్థం చేసుకోవడంలో, పంచుకోవడంలో మగవారి కంటే ఒక అడుగు ముందే ఉంటారు మహిళలు. అలాగని అన్నీ తామే చేయాలనుకుని, అందరినీ సంతృప్తి పరచాలనీ ప్రయత్నిస్తూ తమని తాము మరిచిపోతుంటారు. ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలనూ, తమకంటూ సమయాన్నీ కేటాయించుకోవడమే మానేస్తుంటారు. తమ కష్టాన్ని భాగస్వామి గుర్తించలేదని బాధపడిపోతుంటారు. దీనివల్ల కాలక్రమంలో అసంతృప్తి చుట్టేసే ప్రమాదం ఉంది. ఆ కష్టం విలువ తెలియాలన్నా... ఎదుటివారికీ దాని విలువ అర్థం కావాలి. అందుకే వాటిని భాగస్వామికీ పంచండి. అప్పుడే మీ సమస్యలకి ఓ పరిష్కారం లభిస్తుంది. మీపై ఒత్తిడీ తగ్గుతుంది. అభద్రతా దూరం అవుతుంది.

* ఏకాంతం అవసరం... ఆలుమగల అనుబంధంలో అభద్రతకు కారణమయ్యేది... ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దూరమైనప్పుడే. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే... కచ్చితంగా మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. మీ ఇష్టాయిష్టాల్ని భాగస్వామితో పంచుకోండి. ఇవి మీ బంధాన్ని మరింతగా పదిలపరుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్