అదే లోకమా?

వైవాహిక బంధంలో కొత్తగా అడుగుపెట్టినపుడు దంపతులిద్దరూ ఎదుటివారే తమ లోకమన్నట్లుగా ఉంటారు. అవతలివారి అభిప్రాయమే తమది అన్నట్లుగా నడుచుకుంటారు.

Published : 29 Dec 2022 00:13 IST

వైవాహిక బంధంలో కొత్తగా అడుగుపెట్టినపుడు దంపతులిద్దరూ ఎదుటివారే తమ లోకమన్నట్లుగా ఉంటారు. అవతలివారి అభిప్రాయమే తమది అన్నట్లుగా నడుచుకుంటారు. అయితే ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే కొద్ది రోజులకు ఒకరంటే మరొకరికి విసుగు మొదలవుతుంది.

మనసు తెలుసుకొని.. సంసారంలో దంపతులిద్దరూ ఎదుటివారి మనసును తెలుసుకొని నడవాలి. అలాగని తమకంటూ స్పేస్‌ను మర్చిపోకూడదు. తమ వ్యక్తిత్వం, అభిరుచులను మరవకూడదు. అప్పటివరకు ఎలా ఉండేవారో అలా ఉంటూనే.. జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించాలి. అయితే స్నేహితులకు దూరంకాకూడదు. పెళ్లైనంత మాత్రాన మొత్తం సమయాన్ని అవతలివారి కోసమన్నట్లుగా వ్యవహరిస్తే కొంతకాలానికి అది బెడిసి కొట్టొచ్చు. తనకంటూ సమయాన్ని కేటాయించుకొని అందులోనూ బిజీగా ఉండటానికి  ప్రయత్నించాలి. తమ స్పేస్‌ను మనసుకు నచ్చినట్లుగా వినియోగించుకోగలగాలి. సమయపాలన పాటిస్తూ.. వీటన్నింటినీ సమన్వయం చేయగలిగితే చాలు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటివాటికి చోటుండదు. ఎదుటివారు తమను అశ్రద్ధచేస్తున్నారనే భావనకు తావుండదు. అప్పుడే ఒకరంటే మరొకరిపై గౌరవమర్యాదలు పెరుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్