కొత్త సంవత్సరం.. చిన్నారి సంకల్పం..

ఈ ఏడాది ఏమేం చేయాలో నిర్ణయించుకుని ఉంటారు కదూ! మరి పిల్లల గురించి ఏం ఆలోచించారు?

Updated : 01 Jan 2023 05:29 IST

ఈ ఏడాది ఏమేం చేయాలో నిర్ణయించుకుని ఉంటారు కదూ! మరి పిల్లల గురించి ఏం ఆలోచించారు?

* మీ చిన్నారులకు న్యూ ఇయర్‌ రిసొల్యూషన్‌ పట్ల అవగాహన కలిగించండి. వాళ్ల సంకల్పం వారికే కాదు, కుటుంబసభ్యులందరికీ సంతోషాన్నిస్తుంది.

* లక్ష్యం ఆచరణ సాధ్యంగా ఉండాలి. ముందే పది మైళ్లు పరిగెట్టాలని అనుకోకుండా చిన్న దూరంతో మొదలు పెట్టమనండి. లక్ష్యాన్ని సాధిస్తే మీరివ్వబోయే బహుమతి గురించి చెప్పండి. అది చిన్నారిలో ఉత్సాహాన్ని నింపుతుంది.

* చెప్పింది చేయలేకపోతే అమ్మా నాన్న శిక్షిస్తారనే భయం సహజం. శాయశక్తులా పనిచేయడమే మన వంతని, ఫలితం గురించి ఆలోచిస్తూ బెంగటిల్లకూడదని చెప్పండి. దాంతో లక్ష్యం నెరవేరకున్నా నిందించరనే భరోసా ఉంటుంది.

* మొబైల్‌తో కాలక్షేపం చేస్తోంటే బదులుగా ప్రముఖుల జీవిత చరిత్రలు, సైన్స్‌, గెలాక్సీ, డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ లాంటివి చదవమనండి.

* పిల్లల్లో వేళకు నిద్రపోని వాళ్లే అధికం. నిద్రలేమితో ఎన్ని అనర్థాలో చెప్పి, వీడియోలు చూపి ఈ రోజు నుంచి ఆ అలవాటు మార్చుకునేలా ప్రోత్సహించండి.

* సమయం, డబ్బు, తిండి.. ప్రతి దాంట్లో ప్రాధాన్యాలు ఉంటాయని.. ఆ ప్రకారం నడుచుకుంటే సమస్యలు రావని చెప్పండి. కొత్త సంవత్సరం సందర్భంగా కొంత డబ్బు ఇచ్చి.. కొన్ని అవసరాలు తీరాలంటే.. దేనికెలా ఖర్చుపెట్టాలి, ఎంత మిగులుస్తారో అడగండి. ఒకరోజులో ఏయే పనులు చేయొచ్చో, ఎలా వినియోగిస్తారో- లాంటి పరీక్షలు పెట్టండి. దీనివల్ల సమన్వయం, సద్వినియోగం లాంటి నైపుణ్యాలు అలవడతాయి. అప్పుడిక పరిపక్వతతో ఆలోచించి, ఆచరిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్