మాట వినడం లేదా?

టీనేజీ పిల్లలు... పెద్దలు చెప్పిన మాట ఓ పట్టాన వినరు. స్వేచ్ఛగా ఆలోచించాలనుకుంటారు. సొంతంగా పనులు చేయాలనుకుంటారు. వారిని అర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఈ సూచనలు పాటిస్తే సరి.

Published : 25 Jan 2023 00:20 IST

టీనేజీ పిల్లలు... పెద్దలు చెప్పిన మాట ఓ పట్టాన వినరు. స్వేచ్ఛగా ఆలోచించాలనుకుంటారు. సొంతంగా పనులు చేయాలనుకుంటారు. వారిని అర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఈ సూచనలు పాటిస్తే సరి.

బాల్యంలో అమ్మానాన్నలు చెప్పినట్లు నడుచుకొనే పిల్లల ప్రవర్తన యుక్తవయసులోకి వచ్చేసరికి మారడం మొదలవుతుంది. అయితే వయసుతోపాటు వారి ఆలోచనలూ.. మారతాయని గ్రహించాలి. పరిసరాలు, స్నేహితులకు ప్రభావితమై సొంతంగా ఆలోచిస్తుంటారు. ఇదేమీ తప్పు కాదు. కొన్ని విషయాల్లో వారి మాటలకు, అభిప్రాయాలకు విలువ ఇచ్చి చూడండి. కచ్చితంగా వారి తీరులో మార్పు వస్తుంది.

పాటించాలి..  ఏ విషయాన్నైనా పదే పదే చెబితే టీనేజీ పిల్లలకు  నచ్చకపోవచ్చు. వారికేదైనా చెబుతుంటే...దాన్ని ముందు పెద్దవాళ్లు పాటించినప్పుడే వారూ అనుసరిస్తారు. తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకుంటారు.

వాదనలొద్దు.. మన పిల్లలే కదా.. కోప్పడొచ్చని తల్లిదండ్రులు భావించకూడదు. వారితో మాట్లాడేటప్పుడు గొంతును వీలైనంత తక్కువ స్థాయిలో ఉంచి మృదువుగా మాట్లాడాలి. ఈ వయసు పిల్లలు తమ అభిప్రాయాలను అమ్మానాన్నలకు గట్టిగా అరిచి చెప్పాలనుకుంటారు. దానికి రియాక్ట్‌ అయితే చివరకు ఇరువురిమధ్య సంభాషణ వాదనగానే మిగులుతుంది. ఆ అవకాశం ఇవ్వొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్