మొబైల్‌ వదలట్లేదా!

రెండేళ్ల నిత్య... ఫోను లేనిదే అన్నం ముద్ద నోట్లో పెట్టదు. ఐదేళ్ల హర్ష... టీవీ కట్టేస్తే చాలు... ఎవరో కొట్టినట్లే పెద్ద పెట్టున ఏడుస్తాడు. వీళ్లే కాదు...పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి.

Published : 29 Jan 2023 00:02 IST

రెండేళ్ల నిత్య... ఫోను లేనిదే అన్నం ముద్ద నోట్లో పెట్టదు. ఐదేళ్ల హర్ష... టీవీ కట్టేస్తే చాలు... ఎవరో కొట్టినట్లే పెద్ద పెట్టున ఏడుస్తాడు. వీళ్లే కాదు...పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. అయితే, ఇలా మొబైల్స్‌, టీవీలకు అలవాటు పడితే ఆ పిల్లల్లో ప్రవర్తనా పరమైన లోపాలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి పలు సూచనలు చేస్తున్నారు.

* సాధారణంగా రెండు, మూడేళ్ల చిన్నారులు ఆటలు, పాటల ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటారు. ఇందుకోసం సాధారణంగా దృశ్య, శ్రవణాలనే సాధనాలుగా ఎంచుకుంటాం. అలాగని ప్రతి పనికీ గ్యాడ్జెట్స్‌ మీదే ఆధారపడితే మాత్రం...పిల్లలు వాటికి అలవాటు పడి మొబైల్‌ ఇస్తేనే కానీ ఏ పనీ చేయనని మంకు పట్టు పట్టి కూర్చుంటారు. బదులుగా బొమ్మలతో ఆడుకునేలా చూడాలి. కథలు చెప్పి వారిని మరిపించాలి. పెరట్లో తిప్పుతూ పరిసరాలను పరిచయం చేయాలి. అయితే, ఇదేమంత తేలికైన విషయం కాదు...తల్లిదండ్రులూ కాస్త ఓపికతో వ్యవహరిస్తేనే సాధ్యమవుతుంది. దీనివల్ల వారి మెదడూ చురుగ్గా, సానుకూలంగా పనిచేయడం మొదలుపెడుతుంది.

* కాస్త ఎదిగిన పిల్లలు టీవీలకో, మొబైళ్లకో అతుక్కుపోతుంటే...ముందు మీ ఇంటి వాతావరణంలో ఇంకెవరైనా అలా చేస్తున్నారేమో గమనించండి. వారితో ఆ అలవాటు మాన్పించండి. చిన్నారులతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోండి. వారితో ఆటలాడండి. పాటలు పాడండి. ఇవన్నీ... మీ మనసుని కూడా తేలికపరుస్తాయి. వారినీ గ్యాడ్జెట్స్‌కి అలవాటు పడకుండా చేస్తాయి. కాస్త పెద్ద పిల్లలైతే వారి సమయాన్ని అభిరుచుల వైపునకు మళ్లించండి. స్నేహితుల పరిచయం, ఇష్టమైన పనిచేయడం వంటివన్నీ వీడియోల పై ధ్యాసను మళ్లిస్తాయి.

* మీ పనికి అడ్డం వస్తున్నారనో, కాసేపు అల్లరి చేయకుండా ఉంటారనో... పిల్లల చేతికి మొబైల్‌ ఇచ్చే అలవాటుని ముందు మీరు మానుకోండి. ఇంటి పనిలో వారినీ భాగం చేయండి. ఎప్పుడైనా వారి చేతికి ఫోను ఇచ్చినా...కచ్చితంగా సమయాన్ని నిర్దేశించండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడూ, భోజనం చేసేటప్పుడూ, నిద్రపోయేటప్పుడూ...గ్యాడ్జెట్స్‌ జోలికి వెళ్లకుండా నియంత్రించండి. అంతేకాదు, ఫోనులు ఇచ్చేటప్పుడే డేటా నియంత్రణలో ఉంచడం, చైల్డ్‌లాక్స్‌ వేయడం వంటివి చేస్తే వారు అలవాటు పడతారన్న భయం అక్కర్లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్