ఓపిగ్గా చెప్పి మనసు దోచేద్దాం..

చిన్న చిన్న తగాదాలే చినికి చినికి గాలి వానలవుతుంటాయి. ఇరువురూ నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవ పడితే పెరిగేది దూరమే అలా కాకూడదంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారిలా..

Updated : 01 Feb 2023 05:56 IST

చిన్న చిన్న తగాదాలే చినికి చినికి గాలి వానలవుతుంటాయి. ఇరువురూ నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవ పడితే పెరిగేది దూరమే అలా కాకూడదంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారిలా..

*  ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి ఇంట్లో చూపించడం సహజం. ఆ చికాకుతో ప్రతి చిన్న విషయానికీ భాగస్వామిపై కయ్యానికి దిగుతూ ఉంటాం. అలా కాకుండా బయటి విషయాలన్నీ బయటే ఒదిలేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్తే మంచిది.

*  ఏదైనా చిన్న గొడవ మొదలైనప్పుడు ఇద్దరూ పోటీ పడి అరిచినంత మాత్రాన సమస్యకి పరిష్కారం దొరకదని గుర్తుపెట్టుకోవాలి. భాగస్వామి కోపంతో అరుస్తున్నప్పుడు మీరు కూడా ఎదురు వాదనకు దిగకుండా ప్రశాంతంగా ఉండి చూడండి. వారే కొంత సేపటికి మామూలు స్థితికి చేరుకుంటారు.

* భాగస్వామిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీకు నచ్చని ఏ విషయాన్నైనా కోపంతో చిరుబురులాడుతూ కాకుండా నిదానంగా నచ్చ చెప్పండి. అలాగే మీలో మార్చుకోవాల్సిన విషయాలేమిటో కూడా అడిగి చూడండి. బలవంతంగా మీ ఇష్టాలను కూడా భాగస్వామి పై రుద్దే ప్రయత్నం చేయకండి. వారి అభిరుచులకి ప్రాధాన్యం ఇవ్వండి చాలా సంతోషిస్తారు.

*  పిల్లలు పుట్టిన తర్వాత సాథారణంగా దంపతులు వారి వ్యక్తిగతం గురించి ఆలోచించరు. అలా కాకుండా వారిని మెప్పించేందుకు అప్పుడప్పుడూ షికారుకి తీసుకెళ్లటమో, చిన్న చిన్న బహుమతులో ఇచ్చి చూడండి. పనులను పంచుకుంటూ, ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరిస్తూ నడుచుకుంటే బంధం మరింత బలపడుతుందని నిపుణుల సూచన..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్