Published : 03/02/2023 00:10 IST

ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి...

మొక్కకు నిత్యం నీరెంత అవసరమో.. బంధం శాశ్వతం కావాలంటే ప్రతిరోజూ భాగస్వామికి ప్రేమను అందించడం అంతే అవసరమంటారు నిపుణులు. ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూనే ఆ బంధం శాశ్వతమవుతుందని చెబుతున్నారు.

ప్రేమ ఉండటంవల్లే భాగస్వామి అవసరాలన్నీ తీరుస్తున్నాం కదా అనుకోకూడదు. మనసులోని ప్రేమను వారికి మాటల్లో చెప్పాలి. వారికి ఆ  అనుభూతిని కలిగించాలి. మృదువుగా మాట్లాడుతూ, భాగస్వామితో ఆలోచనలను పంచుకోవాలి. వారికి అన్నీ సమకూర్చడమే కాదు, ఏం కావాలో అడగాలి. వారి అవసరాలను తీరిస్తే అవతలివారి మనసులో స్థానం మరింత పదిలమవుతుంది.

ప్రేమించి.. దంపతుల మధ్య ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంలోనే అసలైన బంధం దాగుంది. ఎదుటివారి మాటలను విమర్శనాత్మకంగా కాకుండా సానుకూలంగా చూడాలి. వారి అభిప్రాయాన్ని చులకనగా తీసుకోకుండా గౌరవించగలగాలి. అప్పుడే అవతలివ్యక్తి మనసులో ప్రేమ మరింత పెరుగుతుంది. ఎదుటివారి ఆశయం, లక్ష్యం నెరవేర్చుకోవడంలో చేయందించాలి. అలా ఇరువురి ఆలోచనలు కలిస్తే మనసుకూడా ఒకటవుతుంది. ఇద్దరూ ఒకే మార్గంలో అడుగులు వేయగలిగితే భార్యాభర్తల మనసులూ.. ప్రేమబంధంతో పెనవేసుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని