చేతిలో చెయ్యేసి...

జీవిత సగభాగమైన వారి హృదయంలో పూర్తి స్థానాన్ని పొందాలంటే భాగస్వామికి నూరేళ్లపాటు కలిసి నడుస్తానన్న భరోసానివ్వాలని చెబుతున్నారు నిపుణులు. జీవితమంతా తోడుగా నిలుస్తామని చేతిలో చేయ్యేసి చెప్పే ప్రమాణంతో అవతలివారి మనసును కొల్లగొట్టొచ్చంటున్నారు.

Published : 11 Feb 2023 00:15 IST

జీవిత సగభాగమైన వారి హృదయంలో పూర్తి స్థానాన్ని పొందాలంటే భాగస్వామికి నూరేళ్లపాటు కలిసి నడుస్తానన్న భరోసానివ్వాలని చెబుతున్నారు నిపుణులు. జీవితమంతా తోడుగా నిలుస్తామని చేతిలో చేయ్యేసి చెప్పే ప్రమాణంతో అవతలివారి మనసును కొల్లగొట్టొచ్చంటున్నారు.

కరికొకరు మనసిచ్చి పుచ్చుకోవడంలో చేసుకొనే బాసలు, చెప్పుకొనే ఊసులు శాశ్వతం కావాలి. అప్పుడే ఆ ప్రేమ వందేళ్లైనా సజీవంగా ఉంటుంది. అలా జరగాలంటే ఇరువురి ప్రేమలోనూ నిజాయితీ ఉండాలి. ఆ ఇరువురూ.. ఎదుటివారికిచ్చిన మాటను తప్పకూడదు. జీవితభాగస్వామి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అంతేకాదు, వారిపట్ల ఉండే ప్రేమలో అంకితభావం నిండి ఉండాలి. ప్రతి అనుభవం, అనుభూతినీ కలిసి పంచుకుందామనుకొని ఒట్టేసుకుంటే చాలు. ఆ బంధం శాశ్వతమవుతుంది.

కలిసి.. సంతోషంలో మాత్రమే భాగస్వామ్యాన్ని కోరుకోకూడదు. కష్టాలు, సమస్యలెదురయ్యే సందర్భాల్లోనూ ఒకరికొకరు తోడుగా నిలబడి పోరాడదామనుకోవాలి. అప్పుడే అవి వచ్చినంత వేగంగా దూదిపింజల్లా మాయమవుతాయి. అసలైన ప్రేమలో గౌరవం నిండి ఉంటుంది. మనసంతా నింపుకొన్నామని అనుకుంటే సరిపోదు. వారికిచ్చే గౌరవమర్యాదలోనే ఎంత ప్రేమను పంచుతున్నామో అర్థమవుతుంది. క్లిష్టమైన సందర్భాల్లో చేతిలో చేయివేసుకొని ఒకరికొకరు ఎదుటివారి మనసుకు దగ్గరగా జరిగి, తోడుగా నిలిస్తే చాలు. ఆ ఇరువురినీ ఒంటరితనం బాధించదు. ఎటువంటి సమస్యనైనా కలిసి ఛేదించగల ధైర్యం వస్తుంది. కష్టాలు రావడానికి కూడా భయపడతాయి.

ఇరువురూ.. అనారోగ్యాలు, ఆందోళన, ఒత్తిడి వంటివి దరిచేరకుండా ఇరువురూ కలిసి పోరాడదామనే లక్ష్యాన్ని ఒట్టుగా వేసుకోవాలి. వాటి కోసం జాగ్రత్తలను పాటించడానికి ఇద్దరూ సిద్ధపడాలి. ఆరోగ్యపరిరక్షణను సవాల్‌గా తీసుకోవడానికి భాగస్వామితో కలిసి అడుగులేయాలి. కలిసి ప్రయత్నిస్తే దేన్నైనా సాధించొచ్చని తెలుసుకోవాలి. ఒకరి చేయి మరొకరు వీడకుండా ఉంటూ.. నిండైన ఆరోగ్యం మన సొంతం అనుకొంటే, ఏ అనారోగ్యం దరికి రాదు. కలిసి వేసే ప్రతి అడుగూ సంతోషంతో నిండుతుంది. జీవిత భాగస్వామికి ఎప్పటికప్పుడు తాజాగా తీయని ప్రేమను అందించగలిగితే.. ఆ ఇరువురి జీవితం నందనవనమవుతుంది. ఆ జంట అనుబంధం మాటలకందని భావమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్