మీ మనసే చెబుతుంది...

మనసుకు నచ్చిన వ్యక్తి అనుకోకుండానే ఎదురు పడతారు. తనే మీ సోల్‌మేట్‌ అని  మీ మనసూ చెబుతుంది. దాన్ని గమనించాలంతే! ఎలాగంటారా? సాయపడే సూచనలివిగో..

Published : 12 Feb 2023 00:22 IST

మనసుకు నచ్చిన వ్యక్తి అనుకోకుండానే ఎదురు పడతారు. తనే మీ సోల్‌మేట్‌ అని  మీ మనసూ చెబుతుంది. దాన్ని గమనించాలంతే! ఎలాగంటారా? సాయపడే సూచనలివిగో..

* రోజూ ఎందరినో కలుసుకుంటాం. ఎక్కడో ఒకరు మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగేలా చేస్తారు. వారి వ్యక్తిత్వం, మాట్లాడే విధానం మీ మనసును ఆకర్షిస్తాయి. మీ తత్వానికి సరిపడే వ్యక్తిలా తారసపడతారు. వాళ్ల జీవనశైలి కూడా మిమ్మల్ని పోలి ఉంటుంది. మరోసారి కలిసే సందర్భం కోసం మనసు ఎదురుచూస్తుంది. దీన్నొక సంకేతంగా గుర్తించొచ్చు.

* ఆ వ్యక్త్తితో మాట్లాడేప్పుడు అసౌకర్యం అనిపించదు. ఎన్నాళ్లనుంచో తెలిసినవారిలా మనసుకు తోస్తుంది. వారు మీ పక్కన ఉన్నప్పుడు సమయం గుర్తించలేనంత వేగంగా గడుస్తుంది. తనతో మాట్లాడుతుంటే మీ మనసులోని భారం దూదిపింజలా మారి ఎక్కడాలేని ఉత్సాహంతో నిండుతుంది. అప్పటివరకు లేని కొత్త శక్తి మనసంతా నిండిపోతుంది.

* జీవితంపై మీకున్న విలువలు తనలో కనిపిస్తుంటాయి. నమ్మకాలు కలుస్తాయి. బలమైన బంధమేదో మిమ్మల్ని కలిపినట్లు అనిపిస్తుంది. మీ మనసులోంచి వచ్చే ప్రతి మాటను ఆ వ్యక్తి పూర్తిగా వింటారు, స్పందిస్తారు. ఏదైనా సమస్య, అసంతృప్తి వంటివి కనిపించినప్పుడు అర్థం చేసుకొంటారు. వాటికి తగిన పరిష్కారాన్ని మీరు అడిగిన తర్వాత చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. 

* మిమ్మల్ని, మీ మాటనూ.. గౌరవిస్తారు. మీరు మాట్లాడుతుంటే ఖండించి వేరే అంశంపైకి దృష్టి మరల్చడానికి ప్రయత్నించరు. మీలో కనిపించే ప్రతి చిన్న మార్పునీ గుర్తిస్తారు. నిరంతరం మిమ్మల్ని ప్రశంసించడమే కాదు, మృదువుగా మీ లోపాలను చెప్పడానికి కూడా వెనుకాడరు. వాటిని సరి దిద్దుకోవడమెలాగో చెప్పి ధైర్యాన్నిస్తారు. అటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు అనిపిస్తే మాత్రం అతడే మీ సోల్‌మేట్‌ కావొచ్చు. చేయి అందించమని అడిగితే తిరస్కరించకుండా సమయం తీసుకోండి. మరోసారి ఆలోచించి మంచి నిర్ణయం చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్