కుటుంబ నియమాలు కావాలి!

ప్రతి కుటుంబానికి కొన్ని నియమాలుండాలంటున్నారు నిపుణులు. వీటిని అందరూ పాటించేలా అలవాటు చేసుకొంటే.. పెద్దవాళ్లు మాత్రమే కాదు. పిల్లలకూ క్రమశిక్షణ అలవడుతుంది.

Published : 19 Feb 2023 00:17 IST

ప్రతి కుటుంబానికి కొన్ని నియమాలుండాలంటున్నారు నిపుణులు. వీటిని అందరూ పాటించేలా అలవాటు చేసుకొంటే.. పెద్దవాళ్లు మాత్రమే కాదు. పిల్లలకూ క్రమశిక్షణ అలవడుతుంది. కుటుంబ విలువలనూ నేర్చుకొని పాటించడం మొదలుపెడతారు.

కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్లు నిద్రలేచిన వెంటనే పక్క దుప్పట్లు మడతపెట్టకుండానే పడకగది నుంచి బయటకొస్తారు. వారిని పిల్లలు అనుసరిస్తారు. ఆ తర్వాత వీటిని యధావిధిగా సర్దడానికి ఆ ఇంటి ఇల్లాలికి మరో పది నిమిషాలు కావాల్సివస్తుంది. మరికొందరు ఉదయం బ్రష్‌ చేయకుండానే పనులు ప్రారంభిస్తారు. ఈ అలవాటును పెద్దవాళ్ల నుంచి ఆ ఇంటి చిన్నారులూ నేర్చుకుంటారు. ఇది పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే ప్రతి కుటుంబానికి కొన్ని నియమాలుండాలి. వాటిని అందరూ పాటించడానికి ప్రయత్నిస్తే చాలు.

వీటిని..

నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడిచి, బెడ్‌ సర్దాలి. ఉదయాన్నే కాలకృత్యాలు తప్పనిసరి. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలి. గట్టిగా అరిచి మాట్లాడటం, గొడవలు పెట్టుకోవడం వంటివి ఉండకూడదు. భోజనం అందరూ కలిసి చేయాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. బెడ్‌పై ఆహారాన్ని తీసుకోకూడదు. ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివాటిని రాత్రి తొమ్మిది తర్వాత వినియోగించకూడదు. సమయంలోపు హోంవర్క్‌ పూర్తిచేయాలి. భోజనం చేసే సమయంలో గ్యాడ్టెట్స్‌కు దూరం. సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. టీవీ చూడటానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. పెద్దవాళ్లు చెప్పే ఆలోచన, సలహాలను చిన్నవాళ్లు వినాలి. పిల్లలకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించాలి. అందరూ తీసిన వస్తువు తీసిన చోట పెట్టాలి. వీలైనంతవరకు ఎవరి పనులు వాళ్లు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ నియమాలను ముందుగదిలో ఛార్ట్‌గా తయారుచేసి అంటించండి. ఇంటిల్లపాది వీటిని కఠినంగా కాకుండా అందరూ సమానంగా, ఇష్టంగా అమలు చేసేలా చూస్తే చాలు. మార్పు సాధ్యమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్