ఉద్యోగం చేస్తున్నా... అర్థం కావాలంటే!

ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే గడవని రోజులివి. కుటుంబ బాధ్యతలూ, ఆఫీసు పనులతోనే రోజు గడిచిపోతుంటుంది. దాంతో ఇలాంటప్పుడు కాస్త ప్రణాళికతో వ్యవహరిస్తే... సరదాలకూ, సంతోషాలకూ కూడా సమయం చిక్కుతుంది.

Published : 19 Feb 2023 00:17 IST

ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే గడవని రోజులివి. కుటుంబ బాధ్యతలూ, ఆఫీసు పనులతోనే రోజు గడిచిపోతుంటుంది. దాంతో ఇలాంటప్పుడు కాస్త ప్రణాళికతో వ్యవహరిస్తే...సరదాలకూ, సంతోషాలకూ కూడా సమయం చిక్కుతుంది. అదెలాగంటే...

* ఒకరికొకరు సమయం కేటాయించుకోలేనప్పుడు.... తెలియకుండానే అసంతృప్తి, అభద్రత చుట్టుముట్టేస్తాయి. ఇలాంటప్పుడు ఒకరినొకరు నిందిచుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ వారాంతాన్ని ఒకే రోజు ఉండేలా కేటాయించుకోండి. ఆ రోజుని మీకోసం మీరు మాత్రమే కేటాయించుకోగలిగితే... ఎప్పుడైనా ఓ వారం కుదరకపోయినా ఇబ్బంది అనిపించదు.

* రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపేసినా సరే కనీసం ఓ పూట భోజనమైనా కలిసి చేయండి. ఏ కాస్త తీరిక దొరికినా...ఇతరుల విషయాలు మాట్లాడుకునే బదులుగా...మీ ఇద్దరికి సంబంధించినవి మాత్రమే చర్చించుకోండి. మీ ప్రేవను వ్యక్తం చేయడం, మీ బాధల్ని చెప్పుకోవడం వంటివాటివల్ల మీ అనుబంధం మరింతగా బలపడతుంది. నిజానికి ఎంత చెప్పుకున్నా...ఒక అరగంట సమయం కంటే ఎక్కువ అవసరం లేదు కదా!

* ఏ కాస్త ఖాళీ దొరికినా...చాలామంది విశ్రాంతి పేరుతో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కి పరిమితం అయిపోతున్నారు. తెలియకుండా మీరూ అదే తప్పు చేస్తుంటే...ఇక మీదట వాటికి దూరంగా ఉండండి. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడూ, పడకగదిలోనూ వాటికి స్థానం ఇవ్వకండి. ఇంటికి వచ్చాక ఆఫీసు ఫోనులకు దూరంగా ఉండండి. ఉద్యోగం, ఇల్లూ, వ్యక్తిగత జీవితం వంటి విషయాల్లో సన్నటి గీత గీసుకోవాల్సిందే. అప్పుడే మీరు అలసిపోకుండా ఉంటారు.

* పనిలో భాగంగా...దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావొచ్చు. ఎక్కువ సమయం ఆఫీసులో గడపాల్సి రావొచ్చు. అలాంటప్పుడు ఎదుటివారిలో భయాల్ని, ఆందోళనల్నీ తొలగించాలంటే...తిన్నావా, ఏం చేస్తున్నావు అంటూ ఓ చిన్న పలకరింపు చేసి చూడండి. కచ్చితంగా దాన్నుంచి బయటపడతారు. మిమ్మల్నీ అర్థం చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్