ఇంట్లోనే ఆ పాఠాలు నేర్పండి!

చిన్న పిల్లలు దేన్నైనా సులువుగా అనుకరిస్తారు. ఆ నైపుణ్యాన్ని మంచి విషయాలను నేర్చుకునే దిశగా మళ్లించగలిగితే....  చక్కని పౌరులుగా మారతారు.

Published : 20 Feb 2023 00:09 IST

చిన్న పిల్లలు దేన్నైనా సులువుగా అనుకరిస్తారు. ఆ నైపుణ్యాన్ని మంచి విషయాలను నేర్చుకునే దిశగా మళ్లించగలిగితే....  చక్కని పౌరులుగా మారతారు. ముఖ్యంగా సరైన భావవ్యక్తీకరణ, భాష నేర్చుకునేలా వారిని తీర్చిదిద్దడానికి ఇల్లే బడి కావాలి..

* వచ్చీరాని మాటలతో పసిపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎంత ముచ్చటేస్తుందో! వారికి ప్రపంచాన్నీ, సామాజిక విజ్ఞానాన్ని పరిచయం చేయడానికి బదులుగా... తిడుతున్నట్లో, ఎదుటివారిని చులకన చేస్తున్నట్లో సినీ సంభాషణలు చెప్పించుకుని మురిసిపోతున్నారు. ఆ డైలాగులకు చప్పట్లు కొడుతుంటే అదే గొప్పనుకుని కొనసాగించే ప్రమాదాన్ని పసిగట్ట లేకపోతున్నారు. వయసుకి మించి ఏం మాట్లాడినా కట్టడి చేయాల్సిన సమయమిదే అని తల్లిదండ్రులు గుర్తించగలిగితే పిల్లలు చక్కగా ఎదుగుతారు.

* పిల్లలు మాట్లాడే ప్రతి పదానికీ అర్థం వారికి తెలియకపోవచ్చు. మొదట చిన్నోడే కదా అని మురిసిసోయి... కాస్త పెద్దయ్యే కొద్దీ తప్పొప్పులు ఎంచుతుంటాం. వాటిని ఎక్కడ నేర్చుకున్నావని ప్రశ్నిస్తాం. అయితే, పిల్లలు ఏం నేర్చుకున్నా మొదట మన ఇంటి నుంచే అనే విషయం మరిచిపోవద్దు. కానీ మాట్లాడే మాటతో పాటు దాన్ని సరైన దిశలో వ్యక్తీకరించడం కూడా అలవాటు చేయాలి. కోపం, సంతోషం, బాధ, అనునయం వంటివన్నీ వారికి అర్థమయ్యేలా వివరించాలి.

* చాలామంది చక్కగా మాట్లాడతారు. కానీ, ఎదుటివారు చెప్పేది వినడానికి మాత్రం ఆసక్తి చూపించరు. ఇతరులను అర్థం చేసుకోవడంలో, వారి భావోద్వేగాలను తెలుసుకోవడంలో అది ఎంతో అవసరం. దీన్ని పసి వయసు నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. వారేం చెప్పినా ముందు మీరు ఓపిగ్గా వినగలిగితే దాన్ని కొనసాగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్