కలిసి పని చేసి చూడండి..

పెళ్లైన కొత్తలో ఇరువురికీ ఇంటి పనులేవీ తెలియకపోవచ్చు. అంతమాత్రాన ఒకరినొకరు విమర్శించుకోకుండా ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచే చిట్కాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు.

Published : 20 Feb 2023 00:09 IST

పెళ్లైన కొత్తలో ఇరువురికీ ఇంటి పనులేవీ తెలియకపోవచ్చు. అంతమాత్రాన ఒకరినొకరు విమర్శించుకోకుండా ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచే చిట్కాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. కలిసి ప్రేమతో చేసే కొన్ని పనులు వారి హృదయాల్లో శాశ్వత ప్రేమను నింపుతాయని చెబుతున్నారు.

ఇంట్లో చిన్నప్పటి నుంచి చదువు పేరుతో వంటింటివైపు అడుగులేయకపోవచ్చు. గారంగా అమ్మ అందించే గోరుముద్దలు తింటూ గడిపి ఉండొచ్చు. అయితే ఇంటి పనులు, వంట వంటివన్నీ కష్టమైనవి మాత్రం కాదని తెలుసుకోవాలి. వివాహమైన తర్వాత నచ్చిన వంటకాలను చేసుకొని కలిసి ఆరగించడంలో ఆనందమే వేరు. వంటలో భార్యాభర్తలిద్దరూ తలో చేయేస్తే ఎంత కష్టమైన వంటకమైనా రుచిగా తయారవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వంటలను పోస్ట్‌ చేస్తున్నారు. ఫోన్‌ ఆన్‌ చేస్తే చాలు.. క్షణాల్లో మనసుకు నచ్చిన వంటకాన్ని తయారు చేయడమెలాగో చూడొచ్చు. ఉత్సాహంగా వంటింట్లోకి అడుగుపెట్టగలిగితే రుచికరమైన వంటకం చిటికెలో సిద్ధం చేసుకోవచ్చు. ఒకరికొకరు సాయం చేసుకొంటూ కలిసి పనిచేస్తే ఇంటి వంటకాన్ని ఆస్వాదిస్తూ తినొచ్చు.

డిన్నర్‌.. దంపతులిద్దరూ ఉద్యోగులైతే వంటకు సమయమెక్కడ అనుకోకూడదు. కాస్తంత ముందు నిద్ర లేచి పని పంచుకోగలిగితే అనుకున్నది చిటికెలో పూర్తవుతుంది. ఉదయం సమయం లేకపోతే తేలికగా అయ్యేవాటిని ఎంచుకొని, రాత్రి సమయాల్లో మనసుకు నచ్చింది వండుకోవాలి. వంటింటిని ఇండోర్‌ మొక్కలతో సర్దుకోవడం, అవసరమైన సామాన్లు అందుబాటులో ఉండేలా అమర్చుకోవాలి. డైనింగ్‌ టేబుల్‌ వద్ద కొవ్వొత్తుల వెలుతురులో భోజనం చేస్తే అది రొమాంటిక్‌ డిన్నర్‌గా మారుతుంది.

తోటపని..  పర్యావరణ కాలుష్యాన్ని రానివ్వని ఇండోర్‌ మొక్కల పెంపకం మొదలుపెట్టాలి. పెళ్లైన కొత్తలో సరదాగా ఈ పనులను కలిసి చేస్తే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. సాయంకాలాలు మొక్కల పక్కగా ఏర్పాటు చేసుకున్న సిటింగ్‌ ఏరియాలో కలిసి కాఫీ తాగడం, గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం, మాట్లాడుకోవడం ఇరువురిని మరింత దగ్గర చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్