నేర్చుకోనివ్వండి

మనందరికీ ఇంటిని చక్కదిద్దుకోవడం, వంటావార్పూ కంటే కష్టమైన సంగతి పిల్లల పెంపకం. వాళ్లు చెప్పిందానికల్లా ఒప్పుకొంటే ఇక ఎప్పుడైనా కాదంటే ఊరుకోరు.

Published : 21 Feb 2023 00:24 IST

మనందరికీ ఇంటిని చక్కదిద్దుకోవడం, వంటావార్పూ కంటే కష్టమైన సంగతి పిల్లల పెంపకం. వాళ్లు చెప్పిందానికల్లా ఒప్పుకొంటే ఇక ఎప్పుడైనా కాదంటే ఊరుకోరు. మొండివైఖరితో ఎలాగైనా అనుకున్నది సాధించుకోవాలని చూస్తారు. అలాగని ప్రతిదానికీ వ్యతిరేకిస్తే బేలగా, అధైర్యంగా తయారవుతారు. ఈ రెండు పద్ధతులూ సరికాదు, సంయమనంతో వ్యవహరించాలి- అంటున్నారు మనస్తత్వ నిపుణులు. అలాగే చిన్నారులకు పనులు అలవాటు చేయాలట. వారి సలహాలూ సూచనలూ పాటించి మన చిన్నారులకు ఉజ్జ్వల భవిష్యత్తునిద్దామా...

బతిమాలతారు...

తోటిపిల్లల ప్రభావంతోనో, టీవీలో ప్రకటనలకు ఆకర్షితులయ్యో కోరికల చిట్టా ముందుపెడతారు. వాటి కోసం నానా రకాలుగా బతిమాలతారు. ఇంతగా ప్రాధేయపడుతున్నారు కదాని జాలీదయా వర్షించేస్తూ ఖర్చెక్కువైనా వస్తువుల్ని ఇచ్చేస్తుంటే.. ఇక పిల్లల్లో ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అవి గొంతెమ్మ కోరికలుగా మారక ముందే అప్రమత్తమై నిబంధనలు పెట్టండి. రక్షణకు కంచె అవసరమని, సముద్రానికీ ఆనకట్ట తప్పదని గుర్తుంచుకోండి.

వికసించనీయండి...

క్యారమ్‌బోర్డ్‌, చదరంగం, వైకుంఠపాళి లాంటి ఆటలయ్యాక ఆ సాధనాలను తీసిన చోట పెట్టేలా చూడండి. తినేశాక పళ్లేలూ గ్లాసులూ వెంటనే కడిగి స్టాండ్‌లో పెట్టేలా, డ్రెసింగ్‌ టేబులు, వార్డ్‌రోబ్‌లను చిందరవందర చేయకుండా ఉండేట్లు తర్ఫీదివ్వండి. అన్నీ మీరే చేస్తుంటే ఇక వాళ్లకి దేని మీదా శ్రద్ధాసక్తులు ఉండవు. బుద్ధి వికసించదు కూడా.

క్రమశిక్షణ

పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరమే. కానీ అది శిక్షలా కాదు, శిక్షణలానే ఉండాలి. సామర్థ్యాలను పెంచుతూ, తమకు తాము బాధ్యతగా ఉండేలా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్