నమ్మించడానికి ఒట్టేయొద్దు!

పిల్లలు పెద్దలకు ప్రతిబింబాలు. వారి ప్రవర్తన నడవడిక చాలావరకూ తల్లిదండ్రుల తీరూ, కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటుందంటారు మానసిక నిపుణులు. అందుకే వారి ముందు వాదులాడుకోవడం,  అబద్ధాలు చెప్పడం చేయకూడదంటున్నారు.  

Published : 22 Feb 2023 00:12 IST

పిల్లలు పెద్దలకు ప్రతిబింబాలు. వారి ప్రవర్తన నడవడిక చాలావరకూ తల్లిదండ్రుల తీరూ, కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటుందంటారు మానసిక నిపుణులు. అందుకే వారి ముందు వాదులాడుకోవడం,  అబద్ధాలు చెప్పడం చేయకూడదంటున్నారు.  

తేడా ఏం ఉండదు: చిన్న పిల్లలు అబద్ధాలు చెబితే...దండిస్తాం. తప్పు అని మందలిస్తాం. కానీ, వారి ముందు చిన్న చిన్న విషయాలకీ మాటలు మారుస్తుంటే మీ విలువ తగ్గిపోతుంది. ‘నువ్వు చిన్నదానివి కాబట్టి ఆ పని చేయకూడదు...మేం పెద్దవాళ్లం’ అనే భావన మీకుంటే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే కదా అక్కడ వయసుతో సంబంధం ఉండదు.

వాదులాటలొద్దు: ఆలుమగలన్నాక కోపతాపాలుంటాయి. వాటిని పిల్లల ముందు ప్రదర్శించడం, ఒకరినొకరు నిందించుకోవడం చేయొద్దు. అవి వారి మనసుల్ని గాయపరచడమే కాదు, ఆ పదప్రయోగాలనూ, మాటలనూ వారూ నేర్చుకుంటారు. ఇతరులపై ప్రయోగిస్తారు. కాబట్టి సమస్యను దంపతులిద్దరు పరిష్కరించుకోవాలే తప్ప చిన్నారుల ముందు గొడవ పడకూడదు.

ప్రమాణాలొద్దు.. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం వంటివి సహజంగా రావాలి. పిల్లలకైనా సరే ఏదైనా విషయం చెప్పి నమ్మించడానికి ప్రామిస్‌ అనేయొద్దు. ప్రతి చిన్న విషయానికీ ఇలా ప్రమాణాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకునే అవకాశం ఉంది. దాన్నే ఆయుధంగా చేసుకుని భావోద్వేగాలతో మిమ్మల్ని కట్టిపడేసే ప్రమాదమూ.. ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్