పోలిక సరైనది కాదు..

ఎదురింటావిడ కొత్త నగ కొనుక్కుందనో.. పక్కింటి వాళ్లు ఫర్నిచర్‌ కొన్నారనో ఇంట్లో కొత్త సమస్యను తెచ్చుకోకూడదంటున్నారు నిపుణులు. ఇతరులతో పోలుస్తూ పోతే.. సంసారంలో మనస్పర్థలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరికి అసంతృప్తి చోటు చేసుకొన్నప్పుడు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతారు.

Published : 22 Feb 2023 00:13 IST

ఎదురింటావిడ కొత్త నగ కొనుక్కుందనో.. పక్కింటి వాళ్లు ఫర్నిచర్‌ కొన్నారనో ఇంట్లో కొత్త సమస్యను తెచ్చుకోకూడదంటున్నారు నిపుణులు. ఇతరులతో పోలుస్తూ పోతే.. సంసారంలో మనస్పర్థలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరికి అసంతృప్తి చోటు చేసుకొన్నప్పుడు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతారు. ఆర్థికపరంగా లేదా వస్తువుల విషయంలో మొదలై.. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకొనే స్థాయికి చేరుకుంటారు. ఇరుగుపొరుగు, బంధువులు, తెలిసినవారంటూ నిత్యం బయటివారి అభివృద్ధి గురించే ఆలోచిస్తూ.. వారితో పోల్చుకుంటూ తమ కుటుంబాన్ని మర్చిపోతారు. క్రమేపీ దంపతులిద్దరినీ ఇది ఒత్తిడిలోకి జారేలా చేస్తుంది.  భాగస్వామి చేస్తున్న పోలికను భరించలేక ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా అవసరానికి మించి అవతలివారు ఖర్చు పెట్టడం మొదలుపెడతారు. ఇది ఆ కుటుంబ ఆర్థికపరిస్థితిని దిగజారేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఆ సంసారాన్ని బీటలువారేలా చేస్తాయి.

కలిసి.. ఎదుటివారితో పోల్చుకోకుండా వారెంచుకున్న మార్గం గురించి తెలుసుకోవాలి. ఆ దిశగా తామూ అడుగులేయడానికి కృషి చేయాలి. అయితే ముందుగా ప్రతి దంపతులు తమ ఆర్థిక స్థాయిని తెలుసుకొని తగినట్లు అంచనా వేసుకోగలగాలి. ఇరువురి మధ్య బంధం బలహీనం కాకుండా కాపాడుకోవాలి. మరొకరితో భాగస్వామిని పోల్చకూడదు. ఎవరి ప్రత్యేకత, జీవనశైలి వారిదే... అన్నది తెలుసుకోవాలి. ఒకరికొకరు చేయూతనిస్తూ.. ఎదుటివారికి తామున్నామనే భరోసా అందించాలి. అప్పుడే ఇరువురూ కలిసి అనుకున్న అభివృద్ధిని సాధించగలరు.

స్ఫూర్తిగా.. కుటుంబ ఆర్థికపరిస్థితి బాగున్నా కూడా.. కొందరు ఇతరులతో పోల్చుకుంటూ ఇంకా ఏదో అందుకోవాలన్న తపన పడతారు. దీనివల్ల సవ్యంగా సాగుతున్న సంసారంలో సమస్యలు మొదలవుతాయి. అలాకాకుండా తమకన్నా తక్కువస్థాయిలో ఉన్నవారు కూడా సంతృప్తిగా ఎలా జీవిస్తున్నారనే నిజాన్ని గుర్తించగలగాలి. భార్యాభర్తల నడుమ బంధాన్నెలా గట్టి పరుచుకోవాలో విజయవంతమైన జంటలను చూసి నేర్చుకోవాలి. ఇరుగుపొరుగులో ఇతరులకు స్ఫూర్తినందిస్తున్న దాంపత్యం గురించి తెలుసుకొని వారిని అనుసరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మరికొందరికి ఆదర్శంగా నిలవొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్