చొరవతో.. సంతోషం

భార్యాభర్తలన్నాక గొడవలు జరగకుండా ఉంటాయా? ఆ కాసేపూ గొడవపడినా తర్వాత పిల్లలకోసమో, సమాజం కోసమో సర్దుకుపోవాల్సిందే అనేవారూ ఉన్నారు.

Published : 02 Mar 2023 00:10 IST

భార్యాభర్తలన్నాక గొడవలు జరగకుండా ఉంటాయా? ఆ కాసేపూ గొడవపడినా తర్వాత పిల్లలకోసమో, సమాజం కోసమో సర్దుకుపోవాల్సిందే అనేవారూ ఉన్నారు. అయితే, దీర్ఘకాలంలో ఈ తీరు... అసంతృప్తులకూ, కుంగుబాటుకీ కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారమూ అవసరమేనని చెబుతున్నారు.

* ఎంత ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా...అవతలి వారికోసం పూర్తిగా మారిపోవడం కష్టమే. ఒకవేళ ఇద్దరిలో ఎవరి బలవంతం మీదైనా మారేందుకు, నచ్చని పనిని చేసేందుకు అంగీకరించినా కూడా ఆ భావన వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించే చోట ఇలాంటి పరిస్థితి తలెత్తదు. మిమ్మల్ని మీరు కోల్పోకూడదంటే మీ మనసుని భాగస్వామికి తెలియజేయండి. ఎందుకు మారాలనుకోవడం లేదో, మీ భావోద్వేగాలు ఏంటో వివరించండి. అప్పడు కచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీ అసంతృప్తీ దూరమవుతుంది.

* విషయం ఏదైనా... ఎప్పుడూ అవతలివారే సర్దుబాటు చేసుకోవాలనే తీరు... ఇద్దరి మధ్యా పొరపొచ్చాలకు దారి తీయొచ్చు. అప్పుడు క్రమంగా మీ మధ్య యాంత్రికత చోటు చేసుకుంటుంది. దీర్ఘకాలంలో ఈ స్థితి ఒకరంటే ఒకరికి నిరాసక్తతను పెంచుతుంది. సర్దుబాటుకి అవకాశం ఉన్న చోట మీరే చొరవ తీసుకుని ఓ అడుగు ముందుకు వేయండి. మరోసారి మీ భాగస్వామి ముందుకు వస్తారు. ఇష్టంగా ఏ పని చేసినా...దానివల్ల ఇబ్బందులు ఎదురుకావు అని గుర్తుచుకోండి చాలు.

* ఎదుటివారిలో లోపం మీకు హాని చేయనిది, ఆరోగ్యకరమే కానీ కేవలం మీకు మాత్రమే మానసిక సంతృప్తి కలిగించనప్పుడు దాన్ని పదే పదే ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. మార్పు తప్పదనుకున్నప్పుడు కచ్చితంగా ఆ విషయాన్ని సున్నితంగానే అయినా అవతలివారికి చెప్పాల్సిందే! అలానే వీలైనంతవరకూ ఎదుటివారిలోని ప్రతికూలతల్ని చెప్పే ప్రయత్నం చేయడమే కాదు... సానుకూలతల్నీ ప్రస్తావించండి. అప్పుడు సర్దుబాట్లు...అసంతృప్తుల ప్రసక్తే రాదు. ఒకరికొకరుగా సాగిపోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్