ఎండల్లో బుజ్జాయి భద్రమిలా..

ఎండలు తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. చిరాకు, చెమట, చర్మ సంబంధిత సమస్యలు ఉఫ్‌... ఒకటా రెండా చెబుతుంటే ఓ పెద్ద జాబితానే తయారవుతుంది.

Published : 10 Mar 2023 00:01 IST

ఎండలు తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. చిరాకు, చెమట, చర్మ సంబంధిత సమస్యలు ఉఫ్‌... ఒకటా రెండా చెబుతుంటే ఓ పెద్ద జాబితానే తయారవుతుంది. మరి మనమే ఆపసోపాలు పడితే చిన్నారుల పరిస్థితేంటి అంటారా? వారికి ఉపశమనం అందించే సూచనలివిగో...

పలుచటి దుస్తులే మేలు... దుస్తులకు ఎన్ని లేయర్స్‌ ఉంటే శిశువులు అంత బొద్దుగా, అందంగా కనిపిస్తారని భావించేవారు పెరిగారు. ఇలా ఫ్యాషన్‌లకి పెద్ద పీట వేసే ఈతరం తల్లులకు ఈ కాలంలో కాస్త పగ్గాలు అవసరం. ఎండలు పెరుగుతున్నప్పుడు గాలి బాగా తగిలే, పలుచటి దుస్తులను మాత్రమే వేయాలి. అప్పుడే వారు ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉంటారు.

డైపర్స్‌ తగ్గించండి...  సౌకర్యమని చెబుతూ... రోజంతా పిల్లలకు డైపర్లు వేసి ఉంచేయొద్దు.  వీటిని ప్లాస్టిక్‌తో తయారుచేయడం వల్ల గాలి తగలక ఇన్‌ఫెక్షన్లు, పొక్కులు వచ్చే ప్రమాదం ఉంది. బదులుగా కాటన్‌ లంగోటీలను వాడితే సరి. వీటిని కూడా ఎప్పటికప్పుడు మార్చడమూ ముఖ్యమే.

ద్రవ పదార్థాలు ఇవ్వాలి... పెదాలు ఎండిపోయే సమస్యలు మనకే కాదు... పిల్లల్లోనూ ఎక్కువే. నీళ్లతో పాటూ కొబ్బరి, బార్లీ వంటి వాటిని తరచూ ఇవ్వండి. ఇవి డీహైడ్రేషన్‌ని దరి చేరనివ్వవు.

అతి వద్దు... ఎండలు మండి పోతున్నాయని పసివాళ్లని రోజంతా ఏసీ గదుల్లో ఉంచుతున్నారా? అలా తరచూ చేస్తే.... వాతావరణంలో హెచ్చు తగ్గులు వారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయన్న సంగతి మరవొద్దు.

రెండు సార్లు స్నానం.. అమ్మో బుజ్జాయిలకు స్నానం చేయించడమంటే పెద్ద పని. అలాగని వదిలేయకండి. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా నీళ్లు పోయండి. కుదరని రోజు తడి వస్త్రంతో అయినా తుడవండి. అప్పుడే వేసవి చికాకులకు దూరంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్