హద్దులుండాలి..

తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, సహోద్యోగులంటూ.. ఎంత దగ్గరైనా  ప్రతి ఒక్కరితోనూ హద్దులు పాటించాలంటున్నారు మానసిక నిపుణులు.

Published : 11 Mar 2023 00:40 IST

తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, సహోద్యోగులంటూ.. ఎంత దగ్గరైనా  ప్రతి ఒక్కరితోనూ హద్దులు పాటించాలంటున్నారు మానసిక నిపుణులు. అప్పుడే ఏ బంధానికైనా విలువ ఉంటుందని చెబుతున్నారు..

బంధాల మధ్య కూడా కొన్ని నియమాలు, నిబంధనలుంటాయి. వీటిని పాటిస్తూ, హద్దుల్లో ఉంటే ఆ బంధం ఎప్పటికీ దూరం కాదు. దీన్ని పాటించడానికి వయసు భేదం అవసరం లేదంటున్నారు నిపుణులు. కుటుంబ సభ్యుల పట్ల పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్లు ఒకరినొకరు హద్దుల్లో ఉంటూనే పరస్పరం గౌరవించుకోవాలి. జీవిత భాగస్వామిపై తమకు హక్కు ఉందని ఎదుటివారు భావించకూడదు. వారి వ్యక్తిగత అంశాలపై వారికి స్వేచ్చ ఉందని గుర్తించాలి. అప్పుడే పిల్లల్లో ఎదుటివారినెలా గౌరవించాలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. అందరిపట్ల మర్యాదగా ఎలా ఉండాలో తెలుసుకుంటారు.

కార్యాలయాల్లో.. సహోద్యోగితో సందర్భమేదైనా ప్రవర్తనాశైలి, మాట్లాడే తీరులో మర్యాద నిండి ఉండాలి. బాస్‌ లేదా ఉద్యోగి.. ఎవరైనా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తమ హద్దులను పాటించాలి. లేదంటే ఆఫీస్‌లో మంచి వాతావరణానికి అవకాశం ఉండదు. బృందంగా కలిసి పనిచేసే వీలుండదు. ఇవి సత్ఫలితాలను ఇవ్వవు. ఉత్పాదకత తగ్గుతుంది. అలాకాకుండా ఎవరి హద్దుల్లో వారుంటూ ఎదుటివారిని వ్యక్తిగా గుర్తించగలిగితే, ప్రతి ఒక్కరికి ఎదుటివారిపై మరింత మర్యాద పెరుగుతుంది. ఆఫీస్‌ వాతావరణం పనిచేయడానికి అనుకూలంగా మారుతుంది.

స్నేహంలో..  ప్రాణస్నేహమైనా.. హద్దు దాటితే దాన్ని అవతలివారు అవమానంగా భావించే ప్రమాదం ఉంది. స్నేహబంధం బీటలు వారుతుంది. ప్రతి ఒక్కరికీ తమకంటూ సొంత భావాలుంటాయి. వాటిని కించపరిచినట్లు తక్కువ చేసి మాట్లాడితే అది హద్దులు దాటినట్లే. అందుకే మీ పరిధిలో మీరు ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్