వారికి స్వేచ్ఛనివ్వండి...

అందరు పిల్లలు ఒకలా ఉండరు. కొందరు ఏ విషయమైనా తేలిగ్గా పట్టేస్తే.. మరికొంతమంది పిల్లలు కాస్త వెనకబడి ఉంటారు. ఈ తేడాని గ్రహిస్తే పిల్లల పెంపకం తేలికవుతుందని అంటారు నిపుణులు..

Published : 15 Mar 2023 00:01 IST

అందరు పిల్లలు ఒకలా ఉండరు. కొందరు ఏ విషయమైనా తేలిగ్గా పట్టేస్తే.. మరికొంతమంది పిల్లలు కాస్త వెనకబడి ఉంటారు. ఈ తేడాని గ్రహిస్తే పిల్లల పెంపకం తేలికవుతుందని అంటారు నిపుణులు..

పోలికొద్దు: పిల్లలని మరొకరితో పోల్చకండి. ఆ మాటలు వారి మెదడులో బలంగా నాటుకుంటాయి. పిల్లలతో మట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే సున్నితమైన మనసులు బాధ పడతాయి.

శక్తికి తగ్గట్లుగా.. పిల్లలు ఎంత పని చేయగలరో అంతే చెప్పండి. వాళ్ల శక్తికి మించి పని ఇచ్చి, చేయట్లేదని కోపగించుకోవటం వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు. చదువైనా, ఆటలైనా మరే కోర్సు అయినా వారి ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోనివ్వండి.

రుద్దకండి..  చిన్నప్పుడు మనం చెయ్యాలనుకొని చెయ్యలేని చదువు, డ్యాన్స్‌ లాంటివి ఏవైనా ఉంటే వాటిని పిల్లలమీద రుద్దాలనుకుంటాం. ఒప్పించి, బలవంతంగా ప్రోత్సహించటం వల్ల ఏ అంశాన్నీ పూర్తి దృష్టితో నేర్చుకోలేరు. వారి ఎంపికకు ప్రాధాన్యమివ్వండి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూర్చోబెట్టి సున్నితంగా వివరించండి. అలాకాకుండా మొగ్గలోనే వారి ఆలోచనను తుంచేయాలని చూడొద్దు.

తెలుసుకోనిద్దాం.. ఓ పని చేస్తే దాని పర్యావసానం ఎలా ఉంటుందో వాళ్లనే తెలుసుకోనివ్వండి. దాని వల్ల అలాంటి పనులు మరెప్పుడైనా చేయొచ్చా లేదా అనే దానిపై వారికి ఒక అవగాహన వస్తుంది. అలాకాకుండా ప్రతి విషయానికీ వారి వెనుక నిలబడి ఇది చేయొద్దు.. ఇది చెయ్యి అనడం వల్ల ఎప్పటికీ వాళ్లా పనిని నేర్చుకోలేరు.

స్నేహితులతో.. పిల్లల్ని ఎప్పుడూ కట్టేసినట్టు ఇంట్లోనే కూర్చోబెట్టకూడదు. సాయంత్రం వేళలు సరదాగా స్నేహితులతో ఆడుకోనివ్వాలి. మనతో పంచుకోలేని ఎన్నో విషయాలు వారితో చెప్పుకొంటారు. సమయం కేటాయించి పార్క్‌కి కానీ బయటకు ఎక్కడికైనా తీసుకెళ్తే పిల్లల్లోని ఒత్తిడి దూరమై మనసు తేలికపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్