పెళ్లైన మొదటి ఏడాదే కీలకం..

పెళ్లైన కొత్తలో మధుర క్షణాలు మాత్రమే కాదు కొన్ని ఒడుదొడుకులూ ఉంటాయి. దాంపత్య జీవితం ప్రారంభమైన తొలినాళ్లలో ఒకరినొకరు అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. అయితే ఈ దశలో ఎలా సర్దుకుపోయామనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మొదటి రెండేళ్లలో దంపతుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆపాయ్యతలు తగ్గి, సందిగ్ధత పెరిగితే రాబోయే.

Published : 18 Mar 2023 00:05 IST

పెళ్లైన కొత్తలో మధుర క్షణాలు మాత్రమే కాదు కొన్ని ఒడుదొడుకులూ ఉంటాయి. దాంపత్య జీవితం ప్రారంభమైన తొలినాళ్లలో ఒకరినొకరు అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. అయితే ఈ దశలో ఎలా సర్దుకుపోయామనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మొదటి రెండేళ్లలో దంపతుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆపాయ్యతలు తగ్గి, సందిగ్ధత పెరిగితే రాబోయే పదమూడేళ్లలో వాళ్లు విడాకులు తీసుకుంటారనడానికి ఓ సంకేతమని పరిశోధనలు చెబుతున్నాయి. పెళ్లైన మొదటి నాలుగేళ్లలో ఎక్కువ సంతోషంగా ఉన్న జంట  తదనంతరం అసంతృప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ అంటున్నాయి.  

కారణాలు.. దాంపత్య జీవితంలో ఏర్పడే చిన్న చిన్న అసంతృప్తులు, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల బంధం బీటలు వారే అవకాశం ఉంది. ఆకస్మిక బాధ్యతలు, చిన్న విషయాలకే నిరుత్సాహపడటం వంటివి కూడా పొరపచ్చాలు రావడానికి కారణమేనట.

ఇవి కుదరవు... తెలిసో తెలియకో చెడు అలవాట్లకు బానిసై మానసికంగా, శారీరకంగా భాగస్వామిని హింసించటం వల్ల పరస్పర గౌరవం తగ్గిపోతుంది. అలానే, చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రులపై ఎక్కువగా ఆధారపడటం, స్వార్థంగా ఆలోచించడం అనేవి దాంపత్య జీవితానికి గొడ్డలి పెట్టులాంటివి. ఈ విషయాలన్నింటినీ బేరీజు వేసుకొని ప్రవర్తించినప్పుడే మూడుముళ్ల బంధం సజావుగా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్