ఇష్టం పెరగాలంటే... ఇలా చేయండి

వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలెంత సహజమో... గొడవలూ అంతే సాధారణం. అలాగని రోజూ గొడవపడుతూ ఉంటే... క్రమంగా ఒకరిపై ఇంకొకరికి ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది.

Published : 19 Mar 2023 00:11 IST

వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలెంత సహజమో... గొడవలూ అంతే సాధారణం. అలాగని రోజూ గొడవపడుతూ ఉంటే... క్రమంగా ఒకరిపై ఇంకొకరికి ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది. అలాకాకూడదంటే...

* ఆలుమగలే అయినా... ఒకరితో ఒకరు మెలిగే తీరు సరిగా లేకపోతే చిక్కులు చుట్టుముట్టేస్తాయి. ముఖ్యంగా భాగస్వామితో నాణ్యమైన సమయం గడపలేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలే అపార్థాలకు, అభద్రతకూ దారితీస్తాయి. మీ పక్కన వారు కూర్చున్నప్పుడు ఫోనుల్లో గడిపేయడమో, టీవీలు చూస్తుండటమో చేయకండి...ఏ పని చేసినా కలిసి చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు అవతలివారికి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన ఉండదు.

* ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా... కొందరు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఎదుటివారికి కొంత స్పేస్‌ ఇవ్వాలన్న మాట వాస్తవమే కానీ.... పూర్తిగా వదిలేయడం మంచిది కాదు. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలను ఇద్దరూ కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలి. పనులను బాధ్యతగా పంచుకోవాలి. సంతోషాలకూ, సరదాలకూ సమయం కేటాయించుకోవాలి. అవతలివారి బాధల్ని పంచుకోవాలి. అప్పుడే మీ మధ్య బంధం మరింతగా బలపడుతుంది.

* ఇరువురికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండాలే కానీ...పెత్తనం చేయాలన్న తపన ఉండకూడదు. కోపంలోనో, ఒత్తిడిలోనో రువ్వే మాటలు ఎదుటివారిని నొప్పిస్తాయి. నా తత్వం ఇంతే అనేయకండి. ఎప్పుడైనా పొరపాటున మాట్లాడితే...దానికి క్షమాపణ చెప్పడానికి వెనకాడొద్దు. అప్పుడే మీ తీరు వారు అర్థం చేసుకుంటారు. క్రమంగా మార్పుకి యత్నిస్తే సమస్యలు సద్దుమణుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్