కలిసి ఆడుకోనివ్వండి...

బాల్యం పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుందంటారు మానసిక నిపుణులు. అయితే, ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల సంస్కృతి, చదువుల ఒత్తిడి...వారిని తోటివారికి దూరంగా, గ్యాడ్జెట్లకు దగ్గరగా పెరిగేలా చేస్తున్నాయి. ఇది చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా ఉండాలంటే...

Published : 01 Apr 2023 00:19 IST

బాల్యం పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుందంటారు మానసిక నిపుణులు. అయితే, ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల సంస్కృతి, చదువుల ఒత్తిడి...వారిని తోటివారికి దూరంగా, గ్యాడ్జెట్లకు దగ్గరగా పెరిగేలా చేస్తున్నాయి. ఇది చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా ఉండాలంటే...

ఒంటరిగా ఉండే పిల్లలు ఎక్కువ పేచీలు పెడతారంటున్నాయి కొన్ని అధ్యయనాలు. వీలైనంతవరకూ వారి ఆటపాటలు ఒంటరిగా కాకుండా తోటివారితో కలిసి ఉండేలా చూసుకోండి. మీ పనులు పూర్తి చేసుకోవడానికి వారి చేతికి ఫోనులు ఇచ్చేయకండి. ఇరుగుపొరుగున ఉన్న పిల్లల తల్లులతో కలిసి...మీ గడుగ్గాయిలను ఆడించడానికి సమయం కేటాయించుకోండి. ఇంటి పనుల నిర్వహణలోనూ ఈ పద్ధతిని పాటించడం వల్ల విసిగిపోకుండా ఉంటారు. తోటివారితో ఆడుకోవడం వల్ల చిన్నారులూ ఉత్సాహంగా ఉంటారు.

పిల్లలు.. స్నేహితుల ప్రభావంతో మాటవినరనీ, చెడిపోతారనీ భావిస్తారు కొందరు తల్లిదండ్రులు...వారిని ఇంటికే పరిమితం చేస్తుంటారు. దాంతో టీవీ, ఫోనులతోనే కాలక్షేపం చేసేస్తారు. ఇలా చేయడం వల్ల నలుగురిలో ఎలా ఉండాలో, సమస్య వచ్చినప్పుడు తోటివారితో ఎలా సర్దుకుపోవాలో వంటివి అర్థం కావు. మంచి చెడులు చెబుతూ... చక్కటి స్నేహాన్ని అలవాటు చేయండి. మీరూ వారితో కబుర్లు చెబుతూ...గమనించండి. అవన్నీ మీ భయాలే అని అర్థమవుతాయి.

అతి జాగ్రత్తో, గారాబమో....పిల్లలకి ప్రతిదీ వారి అవసరానికంటే ముందే అందించాలని తహతహలాడిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు. దీనివల్ల భవిష్యత్తులో ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడే తత్వం అలవాటయిపోతుంది. ఇది వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాకాకుండా నలుగురిలో కలవడం నేర్చుకుంటే...ఎవరేం చేస్తున్నారో, తమ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో అర్థం చేసుకుని ప్రతిస్పందించగలుగుతారు. తమ కాళ్లపై తాము నిలబడగల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్