కోరిందల్లా ఇవ్వకండి..
పిల్లలు వీడియోగేములు, అనవసరపు వస్తువులు కొనమని మారాం చేస్తారు. కొన్న తర్వాత రెండు రోజుల్లో వాటి అంతు చూసి పక్కన పడేస్తారు. ఇలా మీ ఇంట్లోనూ జరుగుతోందా?
పిల్లలు వీడియోగేములు, అనవసరపు వస్తువులు కొనమని మారాం చేస్తారు. కొన్న తర్వాత రెండు రోజుల్లో వాటి అంతు చూసి పక్కన పడేస్తారు. ఇలా మీ ఇంట్లోనూ జరుగుతోందా?
* ఇంట్లో కూర్చొని ఆడే ఆటలను తగ్గించండి. ఆరుబయట ఆడించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు వీడియోగేములు, స్మార్ట్‌ఫోన్లతో పని ఉండదు. చక్కగా ఒంటికి కావల్సిన వ్యాయామమూ అందుతుంది.
* ‘మనం చిన్నతనంలో వీటన్నింటితో ఎలాగూ ఆడుకోలేదు. కనీసం మన పిల్లలకైనా ఇద్దామ’ని కొనే ముందు.. ఓసారి ఆలోచించండి. వాటి అవసరం వారికెంతుందో గమనించండి. అలా కొన్న వస్తువులు ఇంటినిండా కుప్పలుగా పేరుకుపోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.
* చిన్నపిల్లలు వారికెందుకులే అనుకోకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థమయ్యేలా చెప్పండి. వారు అడిగింది కొనే స్థోమత లేకపోతే వారిపై అరవకండి. వారి చిన్న మనసులు గాయపడతాయి. అర్థమయ్యేలా నచ్చజెప్పండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.