సెలవుల్లో ఉల్లాసంగా...

వేసవి సెలవులొస్తున్నాయంటే అమ్మలు ముందే భయపడిపోతుంటారు. పిల్లల అల్లరి అలా ఉంటుంది మరి. ఇలాంటప్పుడు వేసవి మొత్తానికి ఒక వ్యాపకం లాంటిది ఇచ్చి వారిని బిజీగా ఉంచండి. అప్పుడు అమ్మలు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు..

Published : 19 Apr 2023 00:32 IST

వేసవి సెలవులొస్తున్నాయంటే అమ్మలు ముందే భయపడిపోతుంటారు. పిల్లల అల్లరి అలా ఉంటుంది మరి. ఇలాంటప్పుడు వేసవి మొత్తానికి ఒక వ్యాపకం లాంటిది ఇచ్చి వారిని బిజీగా ఉంచండి. అప్పుడు అమ్మలు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు..

* పరీక్షలు ముగియడంతోనే డ్యాన్స్‌ స్కూళ్లు తెరుచుకుంటాయి. నృత్యాన్ని పిల్లలు కూడా ఇష్టపడతారు. వీలైతే వారిని అందులో చేర్పించండి. ఇది చిన్నారులకి తగిన వ్యాయామం అందించడమే కాదు... వారి రోజునీ ఉల్లాసంగా గడిచి పోయేలా చేస్తుంది.

* పిల్లలకు మట్టిలో ఆడుకోవడం చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మట్టిలో ఆడుకుంటే అనారోగ్యానికి గురవుతారనే భయంతో మట్టిలో చేతులు పెట్టనివ్వం. అలాంటప్పుడు మార్కెట్‌లో రంగురంగుల క్లే కిట్‌లు దొరుకుతున్నాయి. వాటిని కొనిచ్చేయండి. బుద్ధిగా కూర్చొని వాటితో నచ్చిన బొమ్మలు చేసుకుంటుంటారు.

* గ్యాడ్జెట్స్‌తో ఆడుకోవటం, కంప్యూటర్‌పై పని చేయటాన్ని కొందరు పిల్లలు ఇష్టపడతారు. ఇలాంటి వారికి కంపోజింగ్‌, సిస్టమ్‌పై అవగాహన వచ్చేందుకు క్లాసులు చెప్పించండి. వారి సమయమూ సద్వినియోగమవుతుంది. ఇలా నేర్చుకున్న కొత్త విషయాలు వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్