అల్లరి పిల్లల్ని దారి మళ్లిద్దామా!

ఒక పక్కన చిరాకుపెట్టే ఎండలు.. ఇంకో పక్కన విసిగించే పిల్లల అల్లరి చేష్టలు.. ఏం చేయాలో తెలీక తల పట్టుకుంటున్నారా? ఈ వేసవి సెలవులు త్వరగా ముగిసి స్కూళ్లు తెరిచే రోజు ఎప్పుడొస్తుందో అంటూ నిట్టూరుస్తున్నారా? అంత సతమతమవ్వాల్సిన పనే లేదు.

Published : 09 May 2023 00:27 IST

ఒక పక్కన చిరాకుపెట్టే ఎండలు.. ఇంకో పక్కన విసిగించే పిల్లల అల్లరి చేష్టలు.. ఏం చేయాలో తెలీక తల పట్టుకుంటున్నారా? ఈ వేసవి సెలవులు త్వరగా ముగిసి స్కూళ్లు తెరిచే రోజు ఎప్పుడొస్తుందో అంటూ నిట్టూరుస్తున్నారా? అంత సతమతమవ్వాల్సిన పనే లేదు. పిల్లల్ని నిమగ్నం చేయడానికి, వాళ్ల ధ్యాస మళ్లించడానికి బోలెడన్ని మార్గాలున్నాయి.. ఇలా చేసి చూడండి...

* పిల్లలకి ప్రకృతి పట్ల ఇష్టం కలిగించండి. ఇక వాళ్లకి సమయమే తెలీదు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలెంత అవసరమో చెప్పి పోషణ అప్పగించండి. వాటితో ఆనందించేలా ఉత్తేజం కలిగించే కబుర్లు చెప్పండి. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే మరీ మంచిది.. విడివిడిగా చెట్లను కేటాయించి పోటీలు పెట్టండి. లేదా ఇరుగు పొరుగు పిల్లలతో పోటీపడి గార్డెనింగ్‌ చేసేలా ప్రోత్సహించండి. పూలు పూస్తుంటే అందాల సీతాకోకచిలుకలు వస్తాయని, కాయలు కాస్తే ఆర్గానిక్‌ కూరగాయలు తినగలుగుతామని చెప్పండి.

* గాడ్జెట్స్‌ వల్ల ఎన్ని అనర్థాలో వివరించి ప్రకృతి గురించిన చక్కటి కబుర్లు చెబుతూ ఆకర్షితులయ్యేలా చేయండి. మబ్బుల్లో అందాన్ని పరిచయం చేసి మేఘాలను గమనిస్తూ, వాటిల్లో ఆకృతులు వెతకమనండి.

* వేసవిలో నీళ్లు లేక పక్షులు చనిపోతున్న వివరాలు చెప్పి.. వాటికి ధాన్యపు గింజలు, నీళ్లు అందివ్వమని చెప్పండి. అది కేవలం దయ చూపడం కాదు, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేయండి.

* మీకు వీలైనప్పుడల్లా జంతువుల కథలు చెప్పండి. మూగజీవాల్ని ప్రేమించాలని, కనిపించిన వాటినల్లా గమనించమనీ చెప్పండి.

* రకరకాల ఆకులనూ, పూలనూ సేకరించమనండి. అయ్యో.. అవెందుకూ.. మా చిన్నారికి హెర్బేరియం అవసరం లేదే- అనకండి. ఇదొక ఆసక్తికరమైన హాబీ. సరదాతో పాటు ఆకులూ పువ్వుల విజ్ఞానమూ అలవడుతుంది. మీకు ఖర్చయ్యేదల్లా ఒక రికార్డు పుస్తకం, అంటించడానికి టేప్‌. కానీ పిల్లలు వాటిని సేకరించే క్రమంలో చక్కటి స్నేహాలూ, మధురమైన అనుభవాలు ఎదురవుతాయి! అంతేనా.. ఆ హెర్బేరియంను చూసినప్పుడల్లా అనుభూతుల దొంతరలు గిలిగింతలు పెడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్