పిల్లలకు తినేటప్పుడు ఫోన్లు ఇస్తున్నారా

తినే సమయంలో పిల్లలు చేసే మారం అంతా ఇంతా కాదు. కాస్తంత తినడానికి ఇల్లంతా ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు. దాన్ని భరించలేక ఫోన్లు, ట్యాబ్‌లు ఇచ్చి తినిపిస్తున్నారు. దీనివల్ల వారు గ్యాడ్జెట్స్‌కు చిన్నప్పటి నుంచే బానిసలుగా మారుతున్నారు. ఈ పద్ధతి మారాలంటున్నారు నిపుణులు.  

Published : 23 May 2023 00:35 IST

తినే సమయంలో పిల్లలు చేసే మారం అంతా ఇంతా కాదు. కాస్తంత తినడానికి ఇల్లంతా ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు. దాన్ని భరించలేక ఫోన్లు, ట్యాబ్‌లు ఇచ్చి తినిపిస్తున్నారు. దీనివల్ల వారు గ్యాడ్జెట్స్‌కు చిన్నప్పటి నుంచే బానిసలుగా మారుతున్నారు. ఈ పద్ధతి మారాలంటున్నారు నిపుణులు.  

ఫోన్లను చూస్తూ అవసరానికి మించి తినేస్తుంటారు. దీనివల్ల చిన్నవయసులోనే ఉబకాయం బారిన పడుతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు. దీనివల్ల పిల్లల్లో ప్రసంగ, భాషా, సామాజిక భావోద్వేగాల అభివృద్ధిలో సమస్యలు ఎదురవుతున్నాయి.

తగ్గించండిలా... ఒకేసారి వాళ్ల నుంచి ఫోన్లు లాక్కున్నా, టీవీలు చూడొద్దన్నా తినకుండా గోల చేస్తారు. నెమ్మదిగా గ్యాడ్జెట్స్‌ను దూరం చేయాలి.

అందరూ ఒకేసారి కూర్చుని తినే అలవాటు చేయాలి. అలా తింటోన్న సమయంలో పిల్లలకు పెద్దవాళ్లకు చర్చ జరిగేలా ప్రోత్సహించాలి. కుటుంబ సభ్యులూ తింటున్న సమయంలో ఫోన్లు, టీవీ, ల్యాప్‌టాప్‌లు చూడకుండా ఉంటే మంచిది. మిమ్మల్ని గమనించే పిల్లలూ నేర్చుకుంటారు.

అసలు స్క్రీన్‌ సమయం లేకుండా ఆహారం తినడం లేదని వాళ్లమీద కోప్పడితే లాభం లేదు. తినేటప్పుడు ముందు 5, 10 నిమిషాలు ఇచ్చి తరువాత తీసేసుకోండి. దీన్ని నెమ్మదిగా తగ్గించండి.

వాళ్ల ఆకలి అవసరాలను అర్థం చేసుకోండి. కడుపు నిండినట్లు అనిపిస్తే తినమని బలవంతం చేయద్దు. గ్యాడ్జెట్స్‌ చూడొచ్చన్న వంకతో ఇష్టమున్నా లేకపోయినా, అవసరమున్నా లేకున్నా తింటుంటారు. అదీ మానుకోండి.

పిల్లలు ఏం తింటున్నారో వారికి చెప్పండి. తినే దానిపై అవగాహన కల్పించండి. రుచి ఎలా ఉన్నదీ అడగండి. రివ్యూ చెప్పడానికి అయినా ఆహారంపై ఆసక్తి చూపిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్