అనుబంధాన్ని పెంచేద్దాం!

రమణి ఇంట్లో అత్తామామలతో మాట్లాడటానికి ఆసక్తి చూపించదు. తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను మాత్రం పూర్తి చేస్తుంది. దీంతో పిల్లలు కూడా నాన్నమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. పెద్దవాళ్లతో పిల్లల అనుబంధాన్ని పెంచాలంటున్నారు

Published : 29 Jun 2023 00:37 IST

రమణి ఇంట్లో అత్తామామలతో మాట్లాడటానికి ఆసక్తి చూపించదు. తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను మాత్రం పూర్తి చేస్తుంది. దీంతో పిల్లలు కూడా నాన్నమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. పెద్దవాళ్లతో పిల్లల అనుబంధాన్ని పెంచాలంటున్నారు

దయం నుంచి సాయంత్రం వరకు హోంవర్క్‌, ట్యూషన్‌ అంటూ పిల్లలకు కనీసం ఆడుకోవడానికి సమయం దొరకడం లేదు. దీంతో నానమ్మ, తాతయ్యలతో ఎక్కువసేపు గడపడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంట్లో అమ్మానాన్న పెద్దవారితో కలివిడిగా ఉండకపోవడంతో పిల్లలకూ ఆ అలవాటు రాదు. దీంతో పెద్దవాళ్లకు చేరువ కాలేరు. .

అనుబంధాన్ని.. పిల్లలకు ప్రతి రోజు ప్రత్యేకంగా ఉండేలా చూడాలంటే అమ్మానాన్నలు వారితో ఎక్కువ సమయం గడపాలి. అలాగే ఇంట్లో నానమ్మ, తాతయ్యతో మాట్లాడటం అలవాటు చేయాలి. వయసుపైబడినవారి నుంచి పిల్లలకు ఎన్నో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. వారి బాల్యంలోని విశేషాలు, జీవితానుభవాలను పిల్లలకు చెప్పించాలి. అవన్నీ వారికి వింతగా ఉన్నాకూడా సరదాగా అనిపిస్తుంది. వాళ్ల బిజీ రోజుల్లో పిల్లలకు పెద్దవాళ్ల ప్రేమ నుంచి దొరికే సాంత్వన మరెక్కడా లభించదు. అంతేకాదు, చిన్నారులు వారిని తమ స్నేహితులుగా భావించడం మొదలుపెడితే సమస్యలను స్వేచ్ఛగా నానమ్మతో పంచుకుంటారు. తాతయ్యకు తమ స్నేహితుల గురించి చెబుతారు. ఇవన్నీ పెద్దవాళ్లకి, పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. దీంతో పిల్లల మానసికారోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వారెదుట.. తల్లిదండ్రులు తమ పెద్దవాళ్లతో ప్రేమగా నడుచుకోవాలి. వారి అవసరాలను తీర్చడంతోనే బాధ్యత తీరిందని భావించకుండా కాసేపైనా వారితో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అలా వారిపట్ల అమ్మానాన్న వ్యవహరించే తీరుని పిల్లలు ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటారు. దాంతో నానమ్మ, తాతయ్యలకు గౌరవమర్యాదలివ్వడం, ప్రేమించడం వంటివన్నీ నేర్చుకోవడం మొదలుపెడతారు. పెద్దవాళ్ల చిన్నచిన్న అవసరాలను పిల్లలకు అప్పజెప్పాలి. వారికి సమయానికి మందులివ్వడం పిల్లల పనిగా అప్పజెప్పాలి. అలాగే అందరూ కలిసి కాసేపైనా మాట్లాడుకోవడం, ఇండోర్‌ గేమ్స్‌ ఆడుకోవడం వంటి ప్రోత్సాహపూరితమైన వాతావరణాన్ని పెద్దవాళ్లతో కల్పిస్తే చాలు. పిల్లలు వారితో కలిసిపోయి స్నేహంగా ఉంటారు. నానమ్మ, తాతయ్యలపై ప్రేమనే కాదు, వారి మంచిచెడ్డల గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్