మర్యాద ఇవ్వాలండీ..

దంపతుల మధ్య మర్యాద ఇచ్చిపుచ్చుకొనే విధానాన్ని మొదట్నుంచే అలవరుచు కోవాలంటున్నారు నిపుణులు. ఎదుటివారి కోసం వ్యక్తిగతమైన కొన్ని విషయాలను  మాత్రం ఇరువురూ వదులు కోకూడదంటున్నారు.

Published : 05 Jul 2023 00:02 IST

దంపతుల మధ్య మర్యాద ఇచ్చిపుచ్చుకొనే విధానాన్ని మొదట్నుంచే అలవరుచు కోవాలంటున్నారు నిపుణులు. ఎదుటివారి కోసం వ్యక్తిగతమైన కొన్ని విషయాలను  మాత్రం ఇరువురూ వదులు కోకూడదంటున్నారు.

వైవాహికబంధంలో భార్యాభర్తలు పరిస్థితులకు తగ్గట్లు సమస్యలను ఆరోగ్యకరమైన విధానంలో సమన్వయం చేసుకోగలగాలి. సమస్య ఏదైనా కొన్నిసార్లు కారణాన్ని ఎదుటివారిపై మరొకరు నెట్టివేస్తుంటారు. సమస్య పెద్దదవుతుందనే భయంతో తమ పొరపాటు లేకపోయినా అవతలివారు దాన్ని స్వీకరిస్తారు. ఇది సరైన విధానం కాదు. ఇలాంటప్పుడు సమస్యను మాత్రమే చూడకూడదు. భాగస్వామి తన వల్ల జరిగిన పొరపాటును ఎదుటివారిపై వేసే ప్రయత్నం వెనుక కారణాన్ని గుర్తించాలి. దాన్ని ప్రోత్సహించకుండా మృదువుగా ఆ పొరపాటు తమది కాదని అవతలివారికి చెప్పగలగాలి. లేదంటే ఇదే పునరావృతమవుతుంది.  అవతలివారు వేసే అర్థరహితమైన నిందలను భరించకుండా ఉండాలంటే మొదట్లోనే మృదువుగా ఖండించి, వాస్తవాన్ని అవతలివారితో ఒప్పించగలగాలి. అప్పుడే దాంపత్యంలో ఒకరికొకరిపై మర్యాద ఉంటుంది.

త్యాగం.. ఆరోగ్యకరమైన బంధంలో ఇరువురూ ఒకరికోసం మరొకరు త్యాగం చేసే స్థాయిలో ఉంటారు. అయితే కొందరు మాత్రం ఏ సందర్భానికైనా ఎదుటివారే త్యాగం చేయాలని ఎదురుచూస్తారు. ఇది సరైనది కాదు.ఎంతో ముఖ్యమైన విషయమైతే తప్ప, చిన్నచిన్నవాటికి తమని తాము త్యాగం చేయడానికి ఎదుటివారు సిద్ధపడకూడదు. అలాగే దంపతులు తమ వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను వదిలేయకూడదు. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటేనే కలకాలం సంతోషంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్