ఇకపైనా ఆడించండి!

బడులు తెరిచేశారు. ‘ఇక ఆటలన్నీ బంద్‌..!’ అనేయకండి. రోజూ కొంత సమయమైనా వారిని ఆడుకోనివ్వండి. అప్పుడే, వారిలో సృజనాత్మకత, సామాజిక చొరవ, మోటార్‌స్కిల్స్‌ వంటివి అలవడతాయంటారు మానసిక నిపుణులు.

Published : 05 Jul 2023 00:02 IST

బడులు తెరిచేశారు. ‘ఇక ఆటలన్నీ బంద్‌..!’ అనేయకండి. రోజూ కొంత సమయమైనా వారిని ఆడుకోనివ్వండి. అప్పుడే, వారిలో సృజనాత్మకత, సామాజిక చొరవ, మోటార్‌స్కిల్స్‌ వంటివి అలవడతాయంటారు మానసిక నిపుణులు.

సామాజిక చొరవ: ఈ రోజుల్లో ఎక్కువమంది పిల్లలకు ఆటవిడుపు టీవీనే అవుతోంది. అపార్ట్‌మెంట్ల సంస్కృతి, స్కూళ్ల పనితీరు, మారిన జీవనశైలి వంటివన్నీ ఇందుకు కారణాలే. ఒంటరిగా గడిపే అలవాటు, గ్యాడ్జెట్లతోనే కాలక్షేపం చేసే విధానం మనిషి ఎదుగుదలపైనా, వ్యక్తిత్వ వ్యవహారాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే, రోజూ కుదరకపోయినా వారాంతాల్లోనైనా సరే...పిల్లలు తోటివారితో కలిసే ఏర్పాటు చేయండి. ఇలా ఇతర చిన్నారులతో కలిసి ఎగరడం, దూకడం, పరుగెత్తడం వంటివన్నీ వారికి సహజంగానే మోటార్‌ స్కిల్స్‌ని నేర్పిస్తాయి. మిగతా చిన్నారులతో సమన్వయాన్ని అలవాటుచేస్తాయి.

విటమిన్‌ ‘డి’: నేటి పిల్లల్లో ఈ విటమిన్‌ లోపం ఎక్కువగానే కనిపిస్తోంది. సెలవు రోజుల్లో కనీసం అర్ధగంటైనా సరే వాళ్లని ఆరుబయట ఎండకి ఆడుకోనివ్వడమే దీనికి పరిష్కారమంటున్నారు. దీనివల్ల ఎముకలు, చర్మ ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు.

రోగ నిరోధకశక్తికి: మీ పిల్లలకి తరచూ జలుబూ, జ్వరాలు వస్తున్నాయా? దానికీ ఆటలే విరుగుడు. మట్టిలో ఆడుకోవడం వల్ల అందులోని హాని చేయని సూక్ష్మక్రిములు వారిలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయట. పైగా ఆరుబయట ఆటలవల్ల ఆకలీ పెరుగుతుంది. అప్పుడు సరైన సమయానికి తిండీ, నిద్రా చేరువవుతాయి. అంతేకాదు ఈ క్రీడలన్నీ వారి చిట్టి బుర్రల్లో కొత్త ఆలోచనలు పుట్టించేందుకు సాయపడతాయి కూడా. కాకపోతే ఆటనుంచి వచ్చాక స్నానం చేయడం అలవాటు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్