చదువుకోవడానికి అనుకూలంగా...

విద్యాసంస్థలన్నీ తెరిచారు. ఆటల నుంచి తిరిగి చదువు వైపు పిల్లలను మళ్లించాల్సినబాధ్యత పెద్దవాళ్లదే.  దీని కోసం పిల్లలకు ఇంట్లో ప్రత్యేకంగా సౌకర్యవంతమైన చోటొకటి ఏర్పాటు చేసివ్వాలంటున్నారు నిపుణులు.

Published : 09 Jul 2023 01:02 IST

విద్యాసంస్థలన్నీ తెరిచారు. ఆటల నుంచి తిరిగి చదువు వైపు పిల్లలను మళ్లించాల్సిన బాధ్యత పెద్దవాళ్లదే.  దీని కోసం పిల్లలకు ఇంట్లో ప్రత్యేకంగా సౌకర్యవంతమైన చోటొకటి ఏర్పాటు చేసివ్వాలంటున్నారు నిపుణులు.

హోంవర్క్‌ చేయాలన్నా లేదా పాఠ్యాంశాలను బాగా అర్థమయ్యేలా చదువుకోవాలన్నా.. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ముందుగా పిల్లలకు ఏకాగ్రత చెదరనివ్వని చోటును ఇంట్లో ఎంపిక చేసివ్వాలి. దాన్ని వారి గదిగా కేటాయిస్తే మరీ మంచిది. అక్కడే ప్రతిరోజూ తమ వర్క్‌ను పూర్తి చేసుకొనేలా అలవాటు చేయాలి. బయటి వాతావరణం కనిపించేలా ఉంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చేపోయేవాళ్లెవరూ కనిపించకుండా ఉండేలా, టీవీ శబ్దాలు వినిపించని గదిని వారికివ్వాలి. లేదంటే వారి ఏకాగ్రత తప్పుతుంది.

కిటికీ పక్కగా.. గదిలో కిటికీ పక్కగా స్టడీ టేబుల్‌, కుర్చీతోపాటు దగ్గర్లో పుస్తకాల అలమర ఉండాలి. అవసరమైన పుస్తకాలను అప్పటికప్పుడే తీసుకొనే సౌకర్యం ఉంటే పిల్లలకు ఆసక్తి దూరమవ్వదు. బల్లపై ఓ పక్కగా ఇండోర్‌ మొక్కనుంచాలి. దాన్ని పెంచే బాధ్యతా వాళ్లదే. చిన్న స్నాక్స్‌ బాక్సు, పెన్సిళ్లు, పెన్నులు, స్కేలు వంటి టూల్‌ బాక్సు వంటివి సర్దడానికి కూడా చోటుండేలా బల్ల పరిమాణం విశాలంగా ఉండాలి. ఒక టేబుల్‌ ల్యాంప్‌ ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. కిటికీ నుంచి బయటకు చూసినప్పుడు తోట లేదా బాల్కనీ, ఆకాశం కనిపిస్తుంటే వారికీ తెలియని ఉత్సాహం. సహజసిద్ధమైన వెలుతురు, మొక్కలు, పూలు వంటివి వారి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి.

గోడపై.. స్డడీ టేబుల్‌కు ఎదురుగా స్కూల్‌ టైం టేబుల్‌, క్యాలెండర్‌ వంటివి అంటించాలి. గది గోడలకు వాల్‌ డెకరేషన్స్‌ బాధ్యత వారికే అప్పగించండి. పిల్లల అభిరుచి మేరకు బొమ్మలు గీసి అంటించమనొచ్చు. వారి లక్ష్యాన్ని ప్రతిబింబించేలా.. విమానం, అంతరిక్షం వంటి వాల్‌పోస్టర్లతో అలంకరించుకోమని సలహానివ్వాలి. గదిలో పుస్తకాల అలమరతోపాటు చిన్న లైబ్రరీ, అలాగే బొమ్మలను సర్దుకొనే కప్‌బోర్డు సౌకర్యం ఉంటే చాలు. ఆ గది వారికిష్టమైన ప్రాంతంగా మారిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్