ఆ నిమిషం మాట్లాడొద్దు

ఈ కంప్యూటర్‌ యుగంలో పిల్లలు మహా తెలివిమీరి ఉంటున్నారు. వాళ్లని పెంచడం ఆషామాషీ వ్యవహారం కాదు. మాట వినకపోవడం, విన్నా పెడచెవిన పెట్టడం, ఎదిరించడాలు, విదిలించడాలు.. అబ్బా.. ఎంత ఇబ్బంది పెడతారో కదా!

Published : 14 Jul 2023 00:14 IST

ఈ కంప్యూటర్‌ యుగంలో పిల్లలు మహా తెలివిమీరి ఉంటున్నారు. వాళ్లని పెంచడం ఆషామాషీ వ్యవహారం కాదు. మాట వినకపోవడం, విన్నా పెడచెవిన పెట్టడం, ఎదిరించడాలు, విదిలించడాలు.. అబ్బా.. ఎంత ఇబ్బంది పెడతారో కదా! అలాంటి చిచ్చర పిడుగుల్ని ఎలా దారికి తెచ్చుకోవాలా అని తల పట్టుకుంటున్నారా? అయితే నిపుణుల ఈ సూచనలు మీ కోసమే...

పిల్లలు ఒక్కోసారి చెప్పింది వినకుండా మొండిగా తాము అనుకున్నట్టే చేస్తుంటే.. కొట్టి తిట్టినందువల్ల పరిస్థితి చక్కబడకపోగా మరింత చేటు జరుగుతుంది. కనుక అప్పటికి మౌనం వహించి, ఆనక నెమ్మదిగా ఆ వైఖరి తెచ్చే అనర్థాల గురించి చెప్పండి.

చదువును నిర్లక్ష్యం చేయడం, వీడియోగేమ్స్‌తో కాలక్షేపం, అర్ధరాత్రి వరకూ నిద్రపోకపోవడం లాంటి విషయాలు విపరీతంగా కోపం తెప్పించే మాట నిజం. కానీ ఆ ఆవేశం పైకి చూపకుండా శ్వాసను గమనిస్తూ కొంతసేపు మౌనంగా ఉండండి. తర్వాత ప్రశాంతంగా మాట్లాడండి. ఇంకా వితండవాదం చేస్తుంటే అవసరమైనవి అందకుండా సహాయ నిరాకరణ చేయండి. మాట్లాడటం మానేయండి. వీటితో మానసిక పరివర్తన వస్తుంది.

ఏదో విషయంలో పిల్లలు అబద్ధాలు చెబుతుంటారు. అది మీ దృష్టికి వచ్చినప్పుడు నిష్ఠూరాలకు బదులు అందువల్ల నమ్మకం పోతుందని, మనల్ని ఇతరులు నమ్మకపోతే అది మనసుకు బాధాకరంగా ఉంటుందని అర్థమయ్యేలా చెప్పండి.

హోంవర్క్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌ లాంటివి ఆలస్యం చేస్తుంటే త్వరగా పూర్తిచేయమని మళ్లీ మళ్లీ చెబితే చిన్నారులకు నసలా ఉంటుంది. సమయానికి పూర్తిచేయడం ఎంత అవసరమో ఒకసారి చెప్పి వదిలేయండి. వినకపోతే స్కూల్లో పరాభవంతో మార్పొస్తుంది. అమ్మ చెప్పినప్పుడే వినాల్సింది అని పశ్చాత్తాపం చెందుతారు.

మీరు కాఠిన్యం చూపితే చిన్నారులు నొచ్చుకుంటారు. ఆ అల్లరి చేష్టల మీదే తప్ప వాళ్ల మీద మీకెలాంటి కోపం లేదని అర్థమయ్యేలా చెప్పండి. తమనెంతో ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు అమ్మానాన్నలకు ఇబ్బంది కలిగించకూడదు- అనే భావన కలుగుతుంది. తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

చక్కటి నీతి కథలు, మహనీయుల చరిత్రలు చెప్పండి. పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి. ఇవి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్