ముభావంగా ఉంటోంటే..

చిన్నారులు ఎవరితో మాట్లాడకుండా.. ఒంటరిగా ఉంటున్నారా? ‘స్కూలుకి వెళ్లడం నచ్చక అలా చేస్తున్నారులే! కొద్దిరోజులకు వాళ్లే సర్దుకుంటారు’ అని వదిలేయొద్దు. ఇది పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు..  అలా కాకుండా వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు.

Published : 24 Jul 2023 00:24 IST

చిన్నారులు ఎవరితో మాట్లాడకుండా.. ఒంటరిగా ఉంటున్నారా? ‘స్కూలుకి వెళ్లడం నచ్చక అలా చేస్తున్నారులే! కొద్దిరోజులకు వాళ్లే సర్దుకుంటారు’ అని వదిలేయొద్దు. ఇది పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు..  అలా కాకుండా వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు.

సమస్యేంటి.. రోజు మొత్తంలో పిల్లలు ఎక్కువ సమయం గడిపేది స్కూలులోనే! మన కంటే పిల్లలను ఎక్కువగా ఉపాధ్యాయులే గమనిస్తుంటారు. కాబట్టి, ఓసారి వారిని కలిసి తరగతిలో ఎలా ఉంటున్నారో తెలుసుకోండి. అలాగే పిల్లాడినీ టీచర్లు తమతో ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారనేది కనుక్కోవాలి. దీన్ని తెలుసుకోవడమూ ముఖ్యమే. టీచర్ల వల్ల సమస్య అన్నాడనుకోండి వారిని నిలదీయొద్దు. మిగతా పిల్లలతోనూ ఓసారి మాట్లాడండి. స్కూలు వాతావరణాన్ని గమనించి.. ఇబ్బంది ఎక్కడో తెలుసుకొనే ప్రయత్నం చేయండి.

భరోసా కల్పించండి.. సమస్య పిల్లాడివైపు ఉంటే.. తల్లిదండ్రులుగా మీ నుంచి పిల్లాడికి ఏం అవసరమో చూడండి. పాఠశాలలో ఏదైనా ఇబ్బంది అయితే క్లాస్‌ టీచర్‌తో మాట్లాడండి. మొత్తంగా తమ బాధ, వేదన అమ్మానాన్నలతో పంచుకోవచ్చు. సమస్య ఏదైనా వాళ్లు తోడుగా ఉంటారన్న భావన వారికి కలగాలి. ఆ భరోసాని వారికి ఇవ్వగలగాలి. అలాగని ప్రతిదానికీ వెనకేసుకొని రావొద్దు. తన తప్పు ఉంటే దాన్నీ నెమ్మదిగా వివరించాలి. ఎలా నడచుకోవాలో చెప్పాలి. అప్పుడే బలమైన వ్యక్తిత్వం వారి సొంతమవుతుంది.

ప్రవర్తన నేర్పించాలి.. కొందరు పిల్లలే సహజంగా బిడియంతో ఉంటారు. వీళ్ల తీరు వల్లా మిగతావాళ్లు కలుపుకోరు. దీన్నీ మార్చాలి. మిగతావారితో కలిసేలా చూడాలి. అవసరమైతే మీరే చొరవ తీసుకొని కొన్నిరోజులు వెంట ఉంటే.. తర్వాత్తర్వాత వాళ్లే నలుగురిలో కలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్