ప్రేమే.. మందు!

ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్‌.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇదో సినిమా డైలాగ్‌.. నిజానికి మనం తిరిగి పొందేది ప్రేమ ఒక్కటే కాదు.

Published : 23 Nov 2023 01:43 IST

ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్‌.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇదో సినిమా డైలాగ్‌.. నిజానికి మనం తిరిగి పొందేది ప్రేమ ఒక్కటే కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా.. ఎలా అంటారా?

ఒత్తిడి తగ్గిస్తుంది: కుటుంబం, స్నేహితులు,  ఇష్టమైన వ్యక్తులతో ఉండే అనుబంధం మనలోని ఒత్తిడిని దూరం చేస్తుంది. వాళ్లు అందించే భావోద్వేగ మద్దతు మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. రక్తపోటుని నియంత్రించి గుండె ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. అందుకే ఎంత బిజీ అయినా సరే రోజులో గంట సేపయినా పిల్లలూ, పెద్దవాళ్లతో గడపండి. మనసు తేలికపడుతుంది.

ఇమ్యూనిటీ పెంచుతుంది: పిల్లల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్‌, డోపమైన్‌ వంటి హార్మోనులు విడుదలై సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ ఎండార్ఫిన్లు సహజ పెయిన్‌ కిల్లర్లుగా పనిచేసి, నొప్పిని తగ్గిస్తాయి.

మంచి నిద్రతో: సామాజిక బంధాలు మానసికంగా మనలో భద్రతా భావాన్ని కలిగిస్తాయి. భావోద్వేగాల పరంగానూ సానుకూల భావన కలిగించి, గాఢమైన నిద్ర పట్టేలా చేస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినిస్తాయి. అందుకే చిన్న విషయాలకే ఎవరిపైనా కోపతాపాలు పెంచుకోకుండా అనుబంధాన్ని బలపరుచుకొనేందుకు ప్రయత్నించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్