మొదట్లోనే ఇవి మాట్లాడొద్దు...

తొలిచూపులోనే అబ్బాయి నచ్చాడు. కానీ మొదటి పరిచయంలో ఏం మాట్లాడాలి అనే భయం ఉంటుంది కొందరిలో.

Published : 26 Nov 2023 02:33 IST

తొలిచూపులోనే అబ్బాయి నచ్చాడు. కానీ మొదటి పరిచయంలో ఏం మాట్లాడాలి అనే భయం ఉంటుంది కొందరిలో. ఆ కంగారులో తడబడి ఏదో ఒకటి మాట్లాడితే.. భవిష్యత్తులో అవే ఇబ్బందులుగా మారొచ్చు...

  • కాస్త ఏకాంతం దొరికి.. ఇద్దరూ మాట్లాడుకునే అవకాశం రాగానే, మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి ఎదుటివారితో గడగడా చెప్పేయొద్దు. ఇలా చెప్పడం వల్ల అవతలి వారికి తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి విషయాలు మొదటి పరిచయంలోనే కాకుండా ఇద్దరి మధ్య కొంత చనువు పెరిగాక మాట్లాడుకోవడం మంచిది.
  • అవతలి వారి మెప్పు పొందాలని.. గొప్పకోసం అన్ని పనులూ చేసేసి, ఉన్నవీ లేనివి చెప్పి.. వాళ్లపై అతి ప్రేమ కురిపించేయొద్దు. ఎందుకంటే తర్వాత సమస్యలు తలెత్తుతాయి. అప్పటిలా నువ్వు లేవు. నాపై ప్రేమ తగ్గింది. మొదట్లో ఉన్నట్టుగా నన్ను పట్టించుకోవటం లేదు అనే మాటలు వినాల్సి వస్తుంది. మీరు మీలా ఉండటమే మంచిది.
  • భాగస్వామి వద్ద నిజాయతీగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని విషయాల గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. మాటల్లో మీ పాత స్నేహాల గురించి ప్రస్తావించి అవతలి వారి మనసులో అనుమానాలు రేకెత్తించవద్దు. చెప్పకపోతే మీ బంధానికి మరింత నష్టం కలుగుతుంది అనుకొన్న విషయాలు తప్ప మరే విషయాలూ ప్రస్తావించవద్దు. మీ ఇష్టాల గురించి మాత్రమే సంభాషించుకోండి. 
  • తొలి రోజుల్లో గంటల కొద్దీ ఫోన్‌లో మాట్లాడటం, సెకెన్‌కో మెసేజ్‌ చేయటం, రిప్లై కోసం ఎదురుచూడ్డం చేస్తుంటారు. దానివల్ల మీకు ఎటువంటి పని లేదు అనే భావన వారిలో కలుగుతుంది. వాటిని అతిగా కాకుండా తగ్గించుకుంటే మంచిది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్