అలకలు మంచికేనట..

దంపతుల మధ్య చిన్నా, పెద్దా గొడవలు చాలానే వస్తుంటాయి. అందుకు పెద్ద పెద్ద కారణాలే అక్కర్లేదు. అవి ఎప్పుడైనా, ఎందువల్లైనా రావొచ్చు.

Published : 28 Nov 2023 02:16 IST

దంపతుల మధ్య చిన్నా, పెద్దా గొడవలు చాలానే వస్తుంటాయి. అందుకు పెద్ద పెద్ద కారణాలే అక్కర్లేదు. అవి ఎప్పుడైనా, ఎందువల్లైనా రావొచ్చు. అయితే, వాటి వల్ల మీ భాగస్వామి గురించి తెలియని కొత్త విషయాలను మీరు తెలుసుకోవచ్చు. తిరిగి వాటిని పునరావృత్తం కాకుండా చూసుకుని మీ బంధాన్ని బలపరుచుకోవచ్చు.

  • తగాదా జరిగిన ప్రతిసారీ కొంతమంది విడిపోవాలనునుకుంటారు. కానీ, ఒక్కోసారి ఈ గొడవల వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ బయటపడుతుంది. అది మరింతగా పెరుగుతుంది. నిజానికి బాధని గుండెల్లో పెట్టుకుని ఒంటరిగా కుమిలిపోయే కంటే... దాన్ని వెళ్లగక్కెస్తే ఆ సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. దాంతో ఇరువురి మధ్య మరింత నమ్మకం ఏర్పడుతుంది.
  • గొడవల వల్ల లాభాలున్నాయి కదాని ప్రతిసారీ కయ్యానికి కాలు దువ్వకూడదండోయ్‌! తగాదాలనేవి అనుకోకుండా వచ్చినప్పుడు వాటిని వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవడానికే ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే దాంపత్య జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. వీలైనంత వరకు గొడవలకి వివాహ బంధంలో చోటు ఇవ్వకూడదు. అప్పుడు మాత్రమే భార్యభర్తల అనుబంధం సాఫల్యం అవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్