మీ మధ్య డబ్బు గొడవలా..

వైవాహిక జీవితంలో చికాకులు తలెత్తడానికి కారణం.. డబ్బు సమస్యలు కూడా. ఆ కారణంగా మీ బంధం విచ్ఛిన్నం కాకూడదంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలంటారు నిపుణులు.

Published : 01 Dec 2023 01:46 IST

వైవాహిక జీవితంలో చికాకులు తలెత్తడానికి కారణం.. డబ్బు సమస్యలు కూడా. ఆ కారణంగా మీ బంధం విచ్ఛిన్నం కాకూడదంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలంటారు నిపుణులు..

ఏ ఇంట్లో అయినా సరే, రాబడిని బట్టే ఖర్చులు ఉండాలి. లేదంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించి ఒడుదొడుకులు తప్పకపోవచ్చు. ఇద్దరూ కలిసి కూర్చుని కుటుంబ అవసరాలను నిర్ణయించుకోండి. ఈ క్రమంలో ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలతో ఉండొచ్చు. కొన్ని సార్లు మీకు అవసరమనిపించింది, మీ వారికి అనవసరంగా తోచొచ్చు. అలాగని వాదులాడుకోకండి. ఓపిగ్గా ఎదుటివారికి నచ్చచెప్పండి.. అర్థం చేసుకుంటారు. దేనికైనా పట్టూ విడుపూ ఉండాలన్న విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు.

క్రమశిక్షణ కావాలి: మంచి జీవితం గడపాలన్నా, సమాజంలో మనుగడ సాధించాలన్నా డబ్బు కావాలి. అలాగని విచ్చలవిడిగా ఖర్చు చేయడం లేదంటే ప్రతి చిన్న విషయంలోనూ పిసినారితనం చూపించడం వంటివి వద్దు. చాలా సందర్భాల్లో ఇవే వాదులాటకు కారణమవుతాయి. చిన్న మొత్తాలను పొదుపు చేయడం, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, ఉన్నదానిలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించడం వంటివి మీ భవిష్యత్తునే కాదు, మీ బంధాన్నీ సంతోషంగా ఉంచుతాయి.

నమోదు చేయాల్సిందే: ఇద్దరూ ఉద్యోగులైతే....  ఖాతాలో నెల జీతం జమ అయిన రోజు నుంచి తీసిన ప్రతి రూపాయి లెక్క రాయండి. అదనపు ఖర్చుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయండి. ఈ పద్ధతి వల్ల డబ్బు ఎక్కడ వృథా అవుతోందో అర్థమవుతుంది. చెల్లింపులకు సంబంధించిన రసీదులు, ఈఎమ్‌ఐలూ, బీమా పాలసీలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు వంటివన్నీ దగ్గర ఉంచుకోండి. లేదంటే మీ ఖర్చుల్ని లెక్కేయడానికి, మీ పొదుపు వివరాలను పొందుపరచడానికీ ఇప్పుడు ఎన్నో స్మార్ట్‌ యాప్‌లూ ఉన్నాయి. వాటిల్లో లాగిన్‌ అయితే సరి సులువుగా మీ లావాదేవీలు పట్టు చిక్కుతాయి. భవిష్యత్తు మీద భయంతో గొడవలు పడే పరిస్థితీ ఎదురుకాదు.

సంతోషాలూ ఉండాలి: అలాగని సరదాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. దానికీ కొత్త బడ్జెట్‌ పెట్టుకోండి. అలాగే అనుకోని ఆపదలూ ముంచుకురావచ్చు. ఇలాంటి వాటి కోసం కొంత సొమ్ముని ప్రతి నెల పక్కన పెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్