ఇలా అయితే.. భలే చదువుతారు!

బాగా చదువుకొమ్మని పిల్లలకు చెబుతాం కానీ.. ఇంట్లో అందుకు తగ్గ వాతావరణం ఉందా అని ఎప్పుడైనా గమనించారా? ప్రత్యేకించి వాళ్లకంటూ ఓ స్థలం లేకపోతే చదువుపై ఏకాగ్రత ఎలా పెంచుకుంటారు.

Published : 03 Dec 2023 01:40 IST

బాగా చదువుకొమ్మని పిల్లలకు చెబుతాం కానీ.. ఇంట్లో అందుకు తగ్గ వాతావరణం ఉందా అని ఎప్పుడైనా గమనించారా? ప్రత్యేకించి వాళ్లకంటూ ఓ స్థలం లేకపోతే చదువుపై ఏకాగ్రత ఎలా పెంచుకుంటారు..

  • పిల్లలు చదువుకొనే చోటే కదా ఎక్కడో అక్కడ కాస్త జాగా ఉంటే చాలు అనుకోవద్దు. పిల్లలు చదువుకొనే స్థలం.. వంటగది పక్కన, బాత్‌రూమ్‌, బెడ్‌ రూమ్‌లకు దూరంగా ఉండేట్టు చూడండి. అలాగే మెట్ల పక్కన కూడా వద్దు. ఎందుకంటే ఆ శబ్దాలకి చదువుపై మనసు పెట్టలేరు. అలాగే స్టడీ రూమ్‌ని గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేచోట ఏర్పాటు చేసుకోవాలి.
  • స్టడీ టేబుల్‌ దీర్ఘ చతురస్రాకారంలో సౌకర్యంగా ఉండేట్టు చూసుకోవాలి. అలానే గదిగోడలు ఆకుపచ్చ, నీలం, పసుపు, తెలుపురంగుల్లో ఉంటే మంచిది. ఈ రంగులు ఏకాగ్రతను పెంచుతాయి. పిల్లలను చురుగ్గా ఉంచుతాయి. ఎరుపు, నలుపు వంటి రంగులైతే.. పిల్లల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తాయి.
  • పిల్లల గదిలో వాళ్లకు ఇష్టమైన రోల్‌మోడల్స్‌, మ్యాప్స్‌, గడియారం వంటివి పెడితే ఇవన్నీ వారికి కొంత జ్ఞానం, సమయపాలన, క్రమశిక్షణ దిశగా నడిపిస్తాయి. టీవీ, మ్యూజిక్‌ సిస్టమ్‌, అద్దాలు ఏర్పాటు చేయొద్దు. ఇవి వాళ్ల దృష్టిని పక్కకు మళ్లిస్తాయి.
  • చిన్న కుండీలో మనీప్లాంట్‌ వంటి మొక్కల్ని పెంచితే పిల్లలు చదివే వాతావరణం ఆహ్లాదంగానూ, ఆరోగ్యవంతంగానూ ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్