ఎదుగుదల తక్కువగా ఉందా..

సుగంధి ఏడేళ్ల కొడుకు చూడటానికి నాలుగేళ్ల పిల్లాడిలా కనిపిస్తాడు. తిండి విషయంలో ఎప్పుడూ పేచీనే. ఇలా వయసుకు తగిన ఎత్తు, బరువు పెరగనప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 06 Dec 2023 01:52 IST

సుగంధి ఏడేళ్ల కొడుకు చూడటానికి నాలుగేళ్ల పిల్లాడిలా కనిపిస్తాడు. తిండి విషయంలో ఎప్పుడూ పేచీనే. ఇలా వయసుకు తగిన ఎత్తు, బరువు పెరగనప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు..

పిల్లలు ఇష్టపడేది వండిపెడితే చాలదు.. అందులో పోషక విలువలుండేలా చూసుకోవాలి. పిల్లల వయసు పెరిగేకొద్దీ పోషకాల అవసరమూ పెరుగుతుంది. ఆ పోషకాలు అందినప్పుడే వాళ్లు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరుగుతారు. 2- 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రోత్‌ డైరీ లేదా ట్రాకర్‌ను ఉపయోగించి ఎత్తును పరిశీలిస్తూ ఉండాలి. ఎదుగుదల సరిగా లేదని గుర్తిస్తే పోషకాహార నిపుణులని కలవాలి. అంతకంటే ముందు భోజన సమయానికి ముందు లేదా తర్వాత చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ఫుడ్‌ తీసుకొనే అలవాటుని పిల్లలకు దూరం చేయాలి. ఏవో ప్రత్యేక సందర్భాల్లో తప్ప పిల్లలకు ఇంటి భోజనాన్నే అలవాటు చేయాలి. మనం వండే వంటలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉండేట్టు జాగ్రత్త పడితే పిల్లల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. ఎదుగుదలకు కావాల్సినంత శక్తి, పోషకాలను అందిస్తాయి.

చూపించి నేర్పించాలి: సెలవురోజున పిల్లలను వంటింట్లోకి ఆహ్వానించండి. వారికి నచ్చే కూరగాయలు వండుతూ.. సాయం చేయమనండి. పండ్లను వారితో నచ్చిన ఆకారాల్లో కట్‌ చేయించి వాళ్లకే వడ్డించండి. కాసేపు తోటపని, ఇంటి శుభ్రత అంటూ చిన్నచిన్న పనులు అప్పజెప్పి వాళ్లతోపాటే ఉండాలి. ఇవన్నీ వ్యాయామంగా మారి కండరాలకు వ్యాయామం అందుతుంది. ఆకలి పెరుగుతుంది. అలాగే పోషక విలువలపైన అవగాహన కలిగిస్తే, అది వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్