లాలి పాట పాడితేనే..

పిల్లలు గలగలా మాట్లాడేస్తుంటే వచ్చే ఆనందమే వేరు కదూ! మరి పిల్లల్లో భాషా నైపుణ్యాలు మెరుగుపడాలంటే ఏం చేయాలో తెలుసా!

Updated : 14 Feb 2024 04:27 IST

పిల్లలు గలగలా మాట్లాడేస్తుంటే వచ్చే ఆనందమే వేరు కదూ! మరి పిల్లల్లో భాషా నైపుణ్యాలు మెరుగుపడాలంటే ఏం చేయాలో తెలుసా!

సాధారణంగా పసివాళ్లకు మాటలు నేర్పించే క్రమంలో అమ్మ, నాన్న, తాత... అంటూ పదాలు చెబుతుంటాం. కానీ నిజానికి ఏడు నెలలు వచ్చే వరకూ పసి పిల్లలు ఆ పదాలను అర్థం చేసుకోలేరట. పదకొండు నెలల వరకూ అస్పష్టంగానే అర్థమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మొదటి నెలల్లోనే పాటలు, పద్యాల రూపంలో మనం వాళ్లకు చెప్తే, త్వరగా గ్రహిస్తారట. మరి ఇంకేం మీ పిల్లలకూ లాలి పాటలు పాడేయండి. భాషను త్వరగా నేర్చుకుని గలగలా మాట్లాడేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్