ప్రతిదానికీ తగవులేనా?

ఎంత భార్యాభర్తలైనా అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. అంతమాత్రాన ప్రతిదానికీ నాదే పైచేయి అంటూ తగవులాడుకుంటే ఎలా? సంసారాన్ని సంతోషంగా సాగించాలంటే...ఈ చిట్కాలు పాటించి చూడండి.

Updated : 16 Feb 2024 05:53 IST

ఎంత భార్యాభర్తలైనా అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. అంతమాత్రాన ప్రతిదానికీ నాదే పైచేయి అంటూ తగవులాడుకుంటే ఎలా? సంసారాన్ని సంతోషంగా సాగించాలంటే...ఈ చిట్కాలు పాటించి చూడండి.

మీరు మీలానే: పెళ్లైన కొత్తలో భాగస్వామిని మెప్పించడానికి కొందరు అలవాట్లను మార్చుకుంటారు. వారి ఆసక్తులను ఇష్టంగా స్వీకరిస్తారు. ఆ విషయాన్ని గుర్తించడం సంగతి అలా ఉంచి... నా పద్ధతే సరైనది, నాకు నచ్చిందే ఇతరులకూ నచ్చాలి అన్నట్లు ప్రవర్తించడం, ఎదుటివారిని చులకన చేసి మాట్లాడటం వంటి పనులు...చేయొద్దు. అవి భాగస్వామిపై ఇష్టాన్ని తగ్గిస్తాయి. పంతాలు, పట్టింపులకు కారణమవుతాయి. ఇద్దరూ ఒకరి నొకరు గౌరవించుకుంటేనే వివాదాలు ఉండవు.

సంకుచితత్వం వద్దు: కలిసి బతకాలనుకున్నప్పుడు... స్వార్థం పనికిరాదు. నాదీ, నేనూ అన్న హద్దులు అసలే వద్దు. అలాగని, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వారి స్వేచ్ఛను మీరు లాగేసుకోవడమూ సరికాదు. ఇది మీ మధ్య అనుబంధాన్ని తగ్గించడమే కాదు... జీవితాన్ని యాంత్రికంగా మార్చేస్తుంది. ఇదే తగవులకూ కారణం అవుతుంది. మీరు ప్రేమించండి. భాగస్వామికీ ఆ అవకాశం ఇవ్వండి. ఏ పనైనా ఒకరికొకరు సాయం చేసుకుంటూ పూర్తి చేయండి. భారం ఉండదు. బాధ్యతగానూ అనిపిస్తుంది.

తెలుసుకోండి: ఒకే మాటగా జీవితాంతం కలిసి నడవాలనుకుంటే సరిపోదు. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఇందుకోసం ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బలాలు, బలహీనతల్ని సమంగా స్వీకరించండి. నొప్పించే విషయాలను సున్నితంగా చెప్పి మార్చుకోమని అడగండి. మీకు ఎదుటివారు అలాంటివే చెప్పినప్పుడు అంగీకరించడానికి మనసుని సిద్ధంగా ఉంచుకోండి. ఇవన్నీ మీ పరిణతిని పెంచుతాయి. సర్దుబాటుతత్వాన్నీ, సంతోషంగా ఉంచే మార్గాల్నీ చూపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్