గట్టిగా చదివితే మంచిదే

కొంతమంది పిల్లలు గట్టిగా బయటకు చదివితే నెమ్మదిగా చదవలేవా అంటూ తిడుతుంటాం. కానీ ఇలా పుస్తక పఠనం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. నిపుణులు. అవేంటంటే.. పిల్లలు పుస్తకంలో పదాలను గుర్తిస్తూ బయటకు చదివేటప్పుడు వాటిని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తారు.

Published : 17 Feb 2024 02:09 IST

కొంతమంది పిల్లలు గట్టిగా బయటకు చదివితే నెమ్మదిగా చదవలేవా అంటూ తిడుతుంటాం. కానీ ఇలా పుస్తక పఠనం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. నిపుణులు. అవేంటంటే..

  • పిల్లలు పుస్తకంలో పదాలను గుర్తిస్తూ బయటకు చదివేటప్పుడు వాటిని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. ఇది వారిలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • విని నేర్చుకునే వారిని ఆడియో లెర్నర్స్‌ అంటారు. ఇలాంటివారు దేన్నైనా శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తారు. వారిలో భాషానైపుణ్యం మెరుగుపడి చిన్నతనం నుంచే ఉచ్ఛారణ అలవాటు అవుతుంది.. పదాలు సులభంగా నేర్చుకుంటారు.
  • చాలామంది పిల్లలకు చదవమంటే చిరాకు వస్తుంది. అదే గట్టిగా చదువు అంటే మాత్రం ఎంతో హుషారుగా ఉంటారు. దీని వల్ల వారిలో ఉన్న ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయని  అంటున్నారు నిపుణులు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్