‘పిచ్‌’ తగ్గితే... స్థాయి పెరుగుతుంది!

బంధమేదైనా సుదీర్ఘకాలం అరమరికలు లేకుండా కొనసాగితే గొప్పేకదా! నలుగురిలోనూ మనం గౌరవంగా కనిపించటం కంటే కావాల్సింది ఏముంది.

Updated : 18 Feb 2024 06:03 IST

బంధమేదైనా సుదీర్ఘకాలం అరమరికలు లేకుండా కొనసాగితే గొప్పేకదా! నలుగురిలోనూ మనం గౌరవంగా కనిపించటం కంటే కావాల్సింది ఏముంది. ఇవన్నీ మీరూ సొంతం చేసుకోవాలా...

కొందరు మాట్లాడితే, పోట్లాడినట్లే ఉంటుంది. మరికొందరు చిన్న విషయాన్నీ పెద్దగా అరుస్తూ చెప్పేస్తుంటారు. వినేవాళ్లకు మాత్రం ఎప్పుడెప్పుడు వీళ్లు సంభాషణ ముగిస్తారా అనిపిస్తుంటుంది. మాట్లాడే తీరు ఇలా ఉంటే ఇక ఎవరైనా స్నేహం చేయడానికీ, ముఖ్యంగా జీవితాన్ని పంచుకోవడానికీ ఎలా ఇష్టపడతారు చెప్పండి. ఎవరైతే మాట్లాడేటప్పుడు లో పిచ్‌లో మాట్లాడతారో అటువంటి వారిని అబ్బాయిలు ఇష్టపడతారట. వాళ్లతో కలిసి నడుద్దామనుకుంటారట. ఇక అమ్మాయిలూ గొంతు తగ్గించి మాట్లాడే అబ్బాయిలను చూసి ఇంప్రెస్‌ అవుతారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. నలభై ఏళ్ల మగవారూ గొంతు తగ్గించి మాట్లాడితే వారిని గౌరవప్రదమైన వ్యక్తులుగా పరిగణిస్తారట. దీన్నిబట్టి అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నిదానంగా, తక్కువ గొంతుతో మాట్లాడే వారినే ఇష్టపడతారు. అటువంటి వారితోనే స్నేహమైనా, పెళ్లయినా, సామాజిక బంధాలైనా సుదీర్ఘకాలం కొనసాగించాలనుకుంటారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్